Monday, April 29, 2024
- Advertisement -

గ్యాస్ట్రిక్ సమస్యా..అయితే ఇలా చెక్ పెట్టండి!

- Advertisement -

భారతీయులు ఆహార ప్రియులు. అయితే టైంకి భోజనం చేయకపోవడం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఫాస్ట్‌గా తినడం,ధూమపానం,మద్యపానం, నిద్రలేమి సమస్య,ఒత్తిడి ఇలా ఏదైనా గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణమవుతోంది.

ప్రధానంగా నచ్చిన ఆహారం ఉంటే కంట్రోల్ చేసుకోలేక అతిగా తింటాం. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణమవుతోంది. ఈ సమస్య వచ్చినప్పుడు చాలమంది ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదా రకరకాల రెమిడీలు వాడుతుంటారు.

అయితే గ్యాస్ట్రిక్ సమస్యలకు కొన్ని ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఒక గ్లాస్ నీటిని బాగా మరిగించి చల్లార్చిన తరువాత ఆ నీటిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి భోజనానికి ముందు లేదా భోజనం చేసిన తరువాత సేవిస్తే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే రెండు టీ స్పూన్ ల నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె కలిపి రాత్రి భోజనం తరువాత పడుకునే ముందు సేవించిన మంచి ఫలితం ఉంటుంది.

పుదీనా రసం, బేకింగ్ సోడా, నిమ్మరసం వంటి మిశ్రమలు కూడా గ్యాస్ ను దూరం చేస్తాయి. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, వంటివి తిన్న గ్యాస్ నుంచి విముక్తి లభిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -