Sunday, May 12, 2024
- Advertisement -

కేసీఆర్ నీదగ్గర సమాధానం ఉందా ?

- Advertisement -

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ‌రంగ‌ల్ స‌భ‌లో సంధించిన ప్ర‌శ్న‌ల‌కు కేసీఆర్ వ‌ద్ద స‌మాధాన‌మే లేద‌ని వ్యాఖ్యానించారు భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు కె.ల‌క్ష్మ‌ణ్‌. సీఎంకు సౌండే లేదు అని తీవ్రంగానే వ్యాఖ్యానించారు. ఓరుగ‌ల్లు స‌భ‌కు భారీ ఎత్తున జ‌నం త‌ర‌లి రావ‌డంతో కేసీర్ ఫ్యామిలీలోనూ.. టీఆర్ ఎస్ మంత్రి వ‌ర్గంలోను ప్ర‌కంప‌నలు మొద‌ల‌య్యాయ‌ని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో బీజేపీ తిరంగా యాత్ర ద్వారా హైద‌రాబాద్ విముక్తి దినోత్స‌వం, తదిత‌ర అంశాల‌పై టీఆర్ ఎస్ ఆసలు క్యారెక్ట‌ర్ బ‌య‌టప‌డింది. కేసీఆర్ రెండు నాలుక‌ల ధోరిణి ప్ర‌జ‌ల‌కు బాగా అర్ధ‌మైంది. పార్టీ కార్యాల‌యంలో విలీనదినం జ‌రిపి, ప్ర‌భుత్వ ప‌రంగా నిర్వ‌హించ‌క‌పోవ‌డంపై కేసీఆర్ స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేక‌పోయార‌న్నారు.

ఇప్ప‌టికే కేసీఆర్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో కూడా వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. బ‌ల‌హీనంగా ఉన్న ప్ర‌తి ప‌క్షాలు కూడా ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ శ‌క్తివంత‌మైన పార్టీలుగా మారుతున్నాయి. ఇక భ‌విష్య‌త్తులో టీఆర్ఎస్ పార్టీ మ‌నుగ‌డ సాధించ‌డం క‌ష్ట‌మే. అటు కేంద్రంపై కూడా టీఆర్ ఎస్ నాయ‌కులు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. ఆ ప‌ద్దతి మార్చుకోక‌పోతే త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని ల‌క్ష్మ‌ణ్‌ అల్టిమేట‌మ్ జారీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -