Saturday, May 4, 2024
- Advertisement -

దేశంలో ఇదో కొత్త ట్రెండ్.. ‘చదివింపుల విందు’..

- Advertisement -

డబ్బులు కావాలంటే మీరు ఏం చేస్తారు. మామూలుగా అయితే ఏదైనా వ్యాపార మార్గం చూస్తుంటారు. ఎలా సంపాదించాలని కష్టపడుతుంటారు. కానీ కొందరు డబ్బులు ఇలా కూడా సంపాదించవచ్చు అని నిరూపించారు. తమిళనాట మొదలైన ఈ కొత్త సంప్రదాయం ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

తమిళనాట మొదలైన చదివింపులు కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇలా కూడా అత్యధిక మొత్తంలో వసూలు చేయాలని ఒక వ్యక్తి నిరూపించాడు. అసలు విషయానికొస్తే తమిళనాడు లోని పుదుక్కోట జిల్లా కీర మంగళం పరిసర గ్రామాల్లో అయిదేళ్లుగా డబ్బులు అత్యవసరంగా కావాలనుకునేవారు కొత్త విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ చదివింపు విందులు అక్కడ వారికి ప్రధాన ఆదాయవనరుగా మారాయి.

వివాహం లేదా ఇతర శుభకార్యాలకు డబ్బు అవసరం ఉన్నవారు చదివింపుల విందులు ఏర్పాటు చేస్తుంటారు. అలానే తాజాగా వాడ కృష్ణమూర్తి అనే రైతు కూడా ఈ భారీ చదివింపు విందును నిర్వహించాడు. అతనికి డబ్బులు అత్యవసరం కావడంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 50 వేల ఆహ్వానపత్రికలు ముద్రించాడు. అందరికీ పంచాడు. మేక మాంసాన్ని సిద్ధంచేసాడు.. అతిథులకు వడ్డించాడు. ఇక తిన్న వారందరూ చదివింపులకు రెడీ అయ్యారు.

చదివింపులకే ఏకంగా 20 చోట్ల ప్రత్యేకంగా వ్యక్తులను ఏర్పాటు చేశాడు. భద్రత సిబ్బందిని నియమించారు. వారంతా కలిసి చదివించిన సొమ్ము లెక్కించగా ఏకంగా నాలుగు కోట్లు తేలింది. ఇందుకోసం బ్యాంకు సిబ్బందిని నియమించి కోట్లను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. తమిళనాట కొత్తగా డబ్బు కావాలనుకునే వారికి ఈ చదివింపుల విందు కార్యక్రమాలు గొప్ప వరంగా మారాయి. ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడిప్పుడే తమిళనాట నుంచి బయటి రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -