టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యవహార శైలి పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చొని ఆయన సమీక్ష నిర్వహించడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఇప్పుడు ఈవార్తే మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అసలు విషయానికి వస్తే విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో లేపాక్షి పుస్తకాల అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కుర్చీలో కూర్చొని మంత్రి దేవినేని ఉమ, ఐఏఎస్ అధికారులతో సమీక్ష చేశారు.
అయితే సమావేశానికి వచ్చిన ఐఏఎస్ అధికారులు… ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం కుర్చీలో కూర్చోవడం చూసి విస్తుపోయారు. ముఖ్యమంత్రి పోస్ట్‌పై ఆసక్తి లేదని చెప్పే…ఆయన సాక్షాత్తూ.. సీఎం కుర్చీలో కూర్చొని సమీక్ష జరపడంపై విమర్శలు వెల్లువెత్తుతుంటే…ఈ వ్యవహారంపై మంత్రి దేవినేని ఉమ నోరు మెదపడం లేదు. సాక్షాత్తు సీఎం బావమర్ధికాండంతోనే ఎవ్వరూ నోరు మెదపడం లేదనేది తెలుస్తోంది.
సీఎం పదవిపై ఆశ లేదని చెప్పే బాలయ్య బాబుకు సీఎం కావడం అంటే ఎంత మోజుఉందో తెలుస్తోంది. ఏదిఏమైనా సీఎం సీట్లో కూర్చొని తన ముచ్చట తీర్చుకున్నారు బాలయ్యబాబు.
