- Advertisement -

1999 నుండి 2002 భూకేటాయింపుల కేసుల‌ను తిర‌గ‌తోడున్న టీ ప్రభుత్వం

- Advertisement -

ఏపీసీఎం చంద్ర‌బాబు నాయుడు త‌ప్పించుకోకుండా ఉచ్చు బిగిస్తోంది తెలంగాణా ప్రభుత్వం. బాబుపై మ‌రో బాంబు పేల్చేంచుకు సిద్ద‌మ‌య్యారు కేసీఆర్‌. ఓటుకు నోటు కేసుతోపాటు 1999 – 2002 మధ్య కాలంలో బాబు విక్ర‌యించిన ఆస్తుల‌న్నింపైనా ఉన్న కేసుల‌ను తెర‌పైకి తీసుకొస్తున్నారు.

అస‌లు విష‌యానికి వ‌స్తే కాంగ్రెసు, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంల్లో తెలంగామ భూముల కబ్జాలపై కేసిఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఎసిబి, విజిలెన్స్, సిఐడి తదితర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో పాటు న్యాయనిపుణుల తదితరులతో సోమవారం ఓ విడత ఆయన సమీక్ష చేసి, మంగళవారంనాడు మరోసారి సమీక్ష జ‌రిపారు.

బాబు 1999 – 2002 మధ్య కాలంలో తెలంగాణ ఆస్తులను విక్రయించిన తీరుపై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ భూములను చౌకగా తనకు సంబంధించినవారికి కట్టబెట్టారనే ఆరోపణలపై ఎసిబి, సిఐడి, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలు కేసులు పెట్టినట్లు తెలుస్తోం. వాట‌న్నింటినీ మ‌రో సారి తెర‌పైకి తెచ్చేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్నారు.

రహేజా సంస్థకు కట్టబెట్టిన భూముల వ్యవహారాన్ని కూడా తవ్వి తీస్తారని అంటున్నారు. పోలెపల్లి సెజ్, మాదాపూర్, మణికొండ ఐటి పార్కులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కు భూముల కేటాయింపులపై కూడా విచరాణ జరుపుతారని టీఆర్ఎస్ పార్టీ అనుబంధ ప‌త్రిక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోరాదనే నిబంధనను చంద్రబాబు ఉల్లంఘించి భూములను తనకు కావాల్సిన వారికి కట్టబెట్టారని అంటున్నారు. ఓటుకు నోటు కేసుతో పాటు మిగిలిన కేసులు విచార‌ణ‌కు వ‌స్తే బాబు రాజ‌కీయ జీవితం స‌మాప్తే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -