Sunday, May 12, 2024
- Advertisement -

విద్యార్థినుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ కొత్త సంవ‌త్స‌ర కానుక‌

- Advertisement -
  • తెలంగాణ క‌స్తుర్బా పాఠ‌శాల్ల‌లో క‌డుపు నిండా భోజ‌నం

వారంలో రెండు రోజులు మటన్, ఐదు రోజులు చికెన్.. ప్రతిరోజూ గుడ్డుతోపాటు స్వీటు, నెయ్యి క‌స్తుర్బా పాఠ‌శాలల విద్యార్థుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అందిస్తున్న భోజ‌నం. కార్పొరేట్ వ‌స‌తిగృహాల్లో అందిస్తు్న భోజ‌నం విద్యార్థుల‌కు అందించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. కొత్త సంవ‌త్స‌రంలో జ‌న‌వ‌రి నుంచి అందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే సన్నబియ్యంతో ప్ర‌భుత్వ‌ వ‌స‌తిగృహాల్లో భోజనం అందిస్తున్నారు.

అంతేకాకుండా మౌలిక వసతుల్లో లోటు లేకుండా ఏర్పాట్లు చేయాల‌ని భావిస్తున్నారు. చ‌లికాలం కావ‌డంతో వేడి నీళ్ల కోసం సోలార్ గీజర్లను ఏర్పాటు చేయబోతున్నారు. వీట‌న్నిటి వచ్చే ఏడాది జనవరిలో ఈ మెనూ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క‌స్తుర్బాగాంధీ బాలిక విద్యాల‌యా (కేజీబీవీ)ల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థినులకు ఇది శుభవార్త‌నే.

కడుపునిండా తింటేనే విద్యార్థులు బాగా చదువుతార‌ని, వారికి కొలతల ప్రకారం తిండి పెట్టడం ఏంటని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. వెనుకబడిన వర్గాల కుటుంబాలకు చెందిన బాలికలు కేజీబీవీల్లో అధికంగా ఉంటారు. ముందే ఇంట్లో స‌క్ర‌మంగా భోజ‌నం చేయ‌ని విద్యార్థుల‌కు కేజీబీవీల్లో పుష్టిక‌ర‌మైన క‌డుపు నిండా అందించేందుకు నిర్ణ‌యించారు. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం విద్యార్థినుల‌కు కొత్త సంవ‌త్స‌ర కానుక ఇదే ఉండ‌నుంది. జనవరి 1వ తేదీ నుంచో లేదా సంక్రాంతి నుంచి కొత్త మెనూను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

విద్యార్థుల‌కు అందించే భోజ‌నం
ప్ర‌తిరోజు మొత్తం 50 గ్రాముల చొప్పున మాంసాహారం
వారంలో రెండు రోజులు మటన్, ఐదు రోజులు చికెన్‌తోపాటు రోజూ గుడ్డు, స్వీటు
ఈ భోజ‌నం రాత్రిపూట అందించే అవ‌కాశం ఉంది.
ఆ త‌ర్వాత శాఖాహారం ఉద‌యం ఇవ్వ‌నున్నారు. దానిలో నెయ్యి కూడా అందిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -