Monday, May 13, 2024
- Advertisement -

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు కేటిఆర్!

- Advertisement -

కళలకి పరిధులు ఎల్లలులేవని నిరూపించారు కేటిఆర్. పది రూపాయలు దానం చేయాలంటేనే వందసార్లు, వెయ్యి కారణాలు ఆలోచించే రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో…

తన రాష్ట్రం వాడు కాదు, తన నియోజకవర్గం అంత కంటే కాదు, తన కులము కాదు, అసలు తనకు సంబందించిన రైతు అంతకంటే కాదు.

 ఆ వృద్దుడు గుంటురు జిల్లా వాసి పేరు నాగయ్య. వేదం సినిమాలో సిరిసిల్లకు చెందిన ఓ రైతు రాములు క్యారెక్టర్ చేసి అందర్ని మెప్పించాడు. అలాంటి వృద్ద కళాకారుడికి అవకాశాలు రాక, ఆకలి తీర్చుకునేందుకు డబ్బులు లేక ఫిల్మ్ నగర్ వీధుల్లో బిక్షాటాన చేస్తున్న నాగయ్యకు అక్షరాల లక్షరూపాయలు ఇచ్చి నెలకి 1500 ఫింఛన్ తెలంగాణ ప్రభుత్వం నుంచి మంజురు చేసి… వృద్ద కళాకారుని ఆదుకొని ఆకలి తీర్చాడు కేటిఆర్. తన పోరాటం కొందరు తప్పు చేస్తున్న ఆంధ్ర పాలకుల పైనే తప్ప ఆంధ్రా ప్రజలపై కాదని నిరూపించాడు కేటిఆర్.  

తనకు ట్విట్టర్‌లో విషయం చెప్పిన వెంటనే స్పందించి, నాగయ్య డీటైల్స్ తెప్పించుకుని, ఆయన్ను తన ఆఫీస్‌కు పిలిపించి సహాయం చేశాడు. తెలుగు ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌తో మాట్లాడి వెంటనే నాగయ్యకు సాయం అందించాలని కూడా కోరారు. ఒక్క చిన్న పనితో కేటిఆర్ తెలంగాణ, ఆంధ్ర, సినిమా అభిమానుల హృదయాలను ఆకర్షించాడు. 

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -