Saturday, May 11, 2024
- Advertisement -

ఈ పదవి చాలు.. సొంత పని చేసుకుంటా!

- Advertisement -

చేసే సేవ, మంచి పనుల ఆధారంగానే.. నాయకులను ప్రజలు గుర్తుంచుకుంటారు. కానీ.. ఉన్న పదవితో సంతృప్తి పొంది.. తర్వాత సొంత పనులు చక్కబెట్టుకునే వాళ్లను మాత్రం జనం ఎప్పుడూ నమ్మరు.

ఇలాంటి వాళ్ల లిస్ట్ లో.. సీనియర్ రాజకీయ నాయకుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా గళాన్ని కాస్త గట్టిగానే వినిపించిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కూడా చేరిపోయేలా కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయాక.. కాంగ్రెస్ తో రాజకీయ భవిష్యత్తు లేదని నిర్థారించుకున్నాక.. టీడీపీ గూటికి చేరిన టీజీ.. ఈ మధ్యే అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

తోటి సీనియర్లతో పోటీని తట్టుకుని.. చివరి నిమిషంలో తెరపైకి వచ్చి.. తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభలో అడుగుపెట్టే చాన్స్ కొట్టేశారు. దీంతో.. తమ ప్రాంతానికేమైనా సేవ చేస్తాడేమో.. నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాడేమో అని రాయలసీమ ప్రజలు.. ముఖ్యంగా టీజీ వెంకటేష్ సొంత జిల్లా కర్నూలు జిల్లా వాసులు ఆశపడ్డారు. కానీ.. ఆ ఆశలు ఆవిరి చేస్తూ.. మన కొత్త రాజ్యసభ సభ్యుడు.. ఓ మాట జారారు. రీసెంట్ గా కర్నూలులో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో.. ఎవరూ ఊహించని కామెంట్లు చేశారు.

తనకు కేంద్ర మంత్రి పదవి వచ్చినా తీసుకోను అని చెప్పిన టీజీ వెంకటేష్.. అక్కడితో ఆగిఉంటే బాగుండేది. కానీ.. కొన్నాళ్లు ఎంపీగా పని చేసి.. తర్వాత ఇల్లూ, వ్యాపారం చక్కదిద్దుకోవాలని ఉంది అని ఇంకో మాట కూడా అన్నారు. అంటే.. ఎంపీ పదవి కావాలి కానీ.. ప్రజా సేవ చేసేందుకు, రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చేందుకు.. కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చినా కూడా తీసుకోరా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవద్దు.. అని ఎవరూ చెప్పరు. మరోవైపు.. కేంద్ర మంత్రిగా టీజీ వెంకటేష్ కు అవకాశం వచ్చే చాన్స్ ఉందని కూడా ఎవరూ ఊహించరు.

కానీ.. రాజకీయాల్లో ఉంటూ.. కొత్తగా పదవిని చేపడుతూ.. ప్రజల సమస్యలపై గట్టిగా మాట్లాడకపోగా.. అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతూనే.. సొంత పనులు చూసుకోవాలన్న మాట.. సరికాదు కదా అని సూచిస్తున్నారు. ఈ విషయంపై.. టీజీ వెంకటేష్ రియాక్షన్ ఎలా ఉంటుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -