Friday, April 19, 2024
- Advertisement -

ఒక్క రూపాయికే లీటరు పెట్రోల్.. ఎగబడ్డ జనం

- Advertisement -

దేశంలో ఇప్పుడు కరోనా కేసులు ఏ రేంజ్ లో పెరిగిపోతున్నాయో.. అదే రేంజ్ లో పెట్రోల్, డిజిల్ రేట్లు కూడా అదేవిధంగా పెరిగిపోతున్నాయి. ఒక దశంలో సామాన్య ప్రజలు వాహనాలు నడపాలంటేనే భయపడిపోతున్నారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ వంద రూపాయల వరకు పెరిగింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్ అంటే జనాలు ఏ రేంజ్ లో ఎగబడతారు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అదేంటీ ఏంటీ లీటర్ పెట్రోలు రూపాయికా? అనే షాక్ కావొద్దు.. ఇది నిజం.

డోంబివలీలోని పెట్రోల్ బంకులో లీటరు పెట్రోలు రూపాయికే పంపిణీ చేశారు. సుమారు 1200 మందికి లీటరుకు ఒక రూపాయి చొప్పున పెట్రోలు అందించారు. మహారాష్ట్ర యువనేత, పర్యావరణ మంత్రి ఆదిత్యా థాక్రే పుట్టినరోజు సందర్బంగా ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. డొంబివ్లీకి చెందిన శివసేన కార్పొరేటర్, దీపేశ్ మత్రే, పూజా మత్రే, కల్యాణ్ యువసేన నేత యోగేశ్ మత్రేతో సహా మరికొంతమంది నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండు గంటలకు రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ను పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వాహనదారులకు బారులుతీరారు. ఇదిలా ఉంటే ఈ లాక్ డౌన్ సమయ నిబంధనలతో.అస‌లే క‌రోనా స‌మ‌యం. ఉద్యోగాలు లేక..ఉపాధి కోల్పోయిన ఈ కష్టకాలంలో రోజురోజుకు జీవ‌నం క‌ష్ట‌మ‌ైపోతోంది. ఈ సమయంలో పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యుడిపై మ‌రింత భారంగా మారాయి.

జబర్దస్త్ కమెడియన్‌ హైపర్ ఆదిపై ఫిర్యాదు.. కారణం ఏంటో తెలుసా?

వకీల్ సాబ్ మళ్లీ తెరపైకి వచ్చేస్తున్నాడు..!

కేసీఆర్ సారు.. రైతులు చావే దిక్కంటున్నారు : వైఎస్ షర్మిల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -