Sunday, May 5, 2024
- Advertisement -

ఉత్త‌రాంధ్ర‌కు పెను విషాదాన్ని మిగిల్చిన తిత్లీ తుఫాన్‌..

- Advertisement -

తిత్లీ దెబ్బకు శ్రీకాకుళం అతలాకుతలమైంది. 12గంటల పాటు ఏకధాటిగా విరుచుకుపడిన తుఫాను పెను విధ్వంసం సృష్టించింది. దాదాపు 2లక్షల హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల కొబ్బరి చెట్లన్ని నేలకూలాయి. గంటకు 160కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడంతో.. చాలాచోట్ల కరెంట్ స్తంభాలు నేలకూలాయి. దీంతో చాలాగ్రామాలు అంధకారంలోనే మగ్గాయి.

ఇప్పటికే 10మంది దాకా మృత్యువాత పడ్డట్టు సమాచారం.గతంలో పెను విలయం సృష్టించిన హుద్ హుద్ కన్నా తిత్లీ తీవ్రత మరింత ఎక్కువగా ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. సముద్రంలో వేటకు వెళ్లి ఆరుగురు, ఇళ్లు, చెట్టు కూలడంతో ఒక్కొక్కరు మరణించినట్లుగా అధికారులు తెలిపారు. 2 వేల కరెంట్ స్తంభాలు నేలకూలగా.. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది.

మొత్తం మీద తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మొత్తం రూ.1,350 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 1.44 లక్షల హెక్టార్లకు పైగా వరి పంట దెబ్బతింది. లక్షలాదిగా కొబ్బరిచెట్లు నేలమట్టమయ్యాయి.

తుఫాను దాటికి ఈదురుగాలుల కారణంగా వేలాది చెట్లు నేలకూలాయి. రోడ్లపై అడ్డంగా భారీ వృక్షాలు పడటంతో రోడ్ నెట్ వర్క్ పూర్తిగా స్తంభించింది. తీర ప్రాంతాలకు వెళ్లే అన్ని మార్గాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. తుఫాన్ తీరాన్ని తాకే స‌మంలో వీచిని రాకాసి అల‌ల‌కు రోడ్ల ప్ర‌క్క‌న ఉన్న భారీ వాహ‌నాలు కూడా ప‌డిపోయాయి.కాకుళం జిల్లాపై తిత్లీ తుఫాన్ ఏ మేరకు ప్రభావం చూపించిందో తెలిపే వీడియో చూడండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -