Thursday, April 25, 2024
- Advertisement -

అయ్యో పాపం .. ఉక్రెయిన్ ..!

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఉక్రెయిన్ ప్రతి రోజు కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంది. పాపం.. నిన్న మొన్నటి వరకు రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి అయిన ..ఉక్రెయిన్ ప్రస్తుతం ప్రాణాంతకమైనా వ్యాదులతో సతమతమౌతుంది. ముఖ్యంగా రష్యా -ఉక్రెయిన్ మద్య జరిగిన యుద్దంలో ఉక్రెయిన్ దేశమే అధికంగా నష్టపోయిందనే చెప్పవచ్చు. రష్యా తో పోలిస్తే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం కావడంతో సైనిక సిబ్బంది పరంగాను, ఆయుధ సంపత్తి పరంగాను, రష్యా దాడులను నిలువరించడంలో ఉక్రెయిన్ విఫలం అయ్యిందనే చెప్పాలి.

దాంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గట్టిగానే జరిగింది. ఎక్కడ చూసిన నిర్మానుషమైన నగరాలు, గుట్టలు గుట్టలుగా శవాల దిబ్బలు దర్శనమిస్తున్నాయి ఉక్రెయిన్ లో. బాంబుల తాకిడికి గురైన కొన్ని నగరాల్లో మాత్రం పరిస్థితి మరి దారుణంగా ఉంది. మరియుపోల్, కేర్సేన్ వంటి నగరాల్లో అయితే కుళ్ళిపోయిన శవాలతోను, కలుషితమైన నీరు తోనూ, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దాదాపుగా ఉక్రెయిన్ అతట కూడా ఇదే పరిస్థితి ఉంది అని చెప్పిన ఆశ్చర్యం లేదు. దాంతో ఇప్పుడు ఉక్రెయిన్ నూ వేధిస్తున్న ప్రదాన సమస్య ప్రాణాంతకమైన వ్యాదులు అక్కడ వ్యాప్తి చెందడం.. ఇప్పటికే ప్రాణాంతకమైన కలరా వ్యాది తీవ్ర స్థాయిల్లో ప్రభల్లుతోంది. కలరా వ్యాధి వ్యాపి మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అక్కడి ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో ప్రజలు ఈ విపత్కర పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో అర్థం కాక సతమతమౌతున్నారు. .

గత నాలుగు నెలలుగా బాంబుల తాకిడికి అట్టుడికి పోయిన ఉక్రెయిన్ ప్రజలు..ఆ పరిణామాల నుండి కోలుకోక ముందే ప్రాణాంతక వ్యాధుల కోరల్లో చిక్కుకున్నారు. దాంతో పాపం.. ఉక్రెయిన్ ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే ..”ములుగుతున్న నక్క పై తాటికాయ పడ్డట్టు ” అయ్యింది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. యుద్దం కారణంగా అక్కడ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో భారీ స్థాయిలో సంక్షోభం ఏర్పడే అవకాశాలు కూడా బలంగానే ఉన్నాయి. మరి ఇంతటి విపత్కర పరిస్థితుల నుండి ఎలా బయట పడుతుందో చూడాలి.

Also Read

ఉక్రెయిన్ అమెరికా ను నమ్మడం లేదా ?

టార్గెట్ 2023 : ఈ ఎన్నికల్లో చెంపెట్టు ఎవరికి ..?

వావ్ : వాట్సప్ కొత్త ఫీచర్స్ .. అదిరిపోయింది గురూ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -