Thursday, April 18, 2024
- Advertisement -

టార్గెట్ 2023 : ఈ ఎన్నికల్లో చెంపెట్టు ఎవరికి ..?

- Advertisement -

గత కొంత కాలంగా ఏపీ రాజకీయాలు విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. అటు అధికార పార్టీ అయిన, ఇటు విపక్ష పార్టీలు అయిన 2024 లో గెలుపే లక్షంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ప్రవేశ పెట్టిన ఎన్నో సరికొత్త పథకాలు ప్రజలకు చేరవేయడంలో సక్సస్ సాధించమని, దాంతో ప్రజలు మళ్ళీ జగనన్నకే పట్టం కడతారని వైసీపీ వర్గం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఇటు విపక్షాలు చెబుతున్నా దాని ప్రకారం జగన్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకోనిందని, దాంతో రాజన్న పాలన కోసం చూసిన జనాలు జగనన్న పాలనతో పూర్తి నిరాశగా ఉన్నారని విపక్షాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సరికొత్త ప్రణాళికలు రచిస్తూ అధికార పార్టీని ఢీ కొట్టేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీ నేతల్లోను, కార్యకర్తల్లోనూ జోష్ నింపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

ఇదిలా ఉండగా ముందస్తు ఎన్నికల ప్రచారం తెరపైకి రావడంతో ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణలను ప్రజలు తీక్షణంగా గమనిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీతో ముదస్తు ఎన్నికల విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు తలమునకలైందని సమాచారం. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం భీహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దాంతో ఈ సారి ఐప్యాక్ వ్యవస్థాపకుడైన రుషిరాజ్ సింగ్ కు వ్యూహకర్త బాద్యతలు అప్పగించింది వైసీపీ. ఆయన ఇప్పటికే గ్రాండ్ వర్క్ కూడా మొదలుపెట్టినలు వైసీపీ వర్గాల్లో వినికిడి. వచ్చే ఏడాది తెలంగాణ, ఛత్తీస్ గడ్, రాజస్తాన్, మద్యప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటితో పాటు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో సి‌ఎం జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెప్పకనే చెప్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లో ప్రభుత్వాన్ని రద్దు చేసి, మార్చిలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే విధంగా అధికార పార్టీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక గత ఎన్నికల్లో ఊహించని విధంగా డీలా పడ్డ టీడీపీ ఈ సారి ముందస్తు ఎన్నికలు వస్తే అన్నీ విధాలుగా సంసిద్దంగా ఉండేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తూ ప్రజల్లోకి వెళ్ళేందుకు చంద్రబాబు, లోకేష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలతో చందరబాబు నాయుడు ప్రజల్లో కనిపిస్తున్నారు. అటు నారా లోకేష్ కూడా భాష, యస మార్చి టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపదమే కాకుండా ప్రజలను ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేసే జనసేనాని కూడా అక్టోబర్ నుంచి ఫుల్ టైమ్ ప్రజల్లో ఉండేందుకు సిద్దమయ్యారు. దాంతో ఏపీలో చక చక జరుగుతున్నా ఈ రాజకీయ సమీకరణలు చూస్తుంటే ఇవన్నీ కూడా ముందస్తు ఎన్నికలకు సంకేతాలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఇక్కక ప్రతి రాజకీయ విశ్లేషకుడికి ఆసక్తి కలిగిస్తున్న విషయం ఏమిటంటే..ఈ సారి ప్రజల చూపు ఎటువైపు అని, సరికొత్త సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి బలంగా వెళ్ళిన వైసీపీ పార్టీ గెలుపు విషయంలో కాన్ఫిడెంట్ గానే ఉన్నప్పటికి, గ్రౌండ్ లెవల్ సర్వేలలో వస్తున్న వార్తల ప్రకారం ప్రభుత్వం పైన ప్రజలు కొంత వ్యతిరేకంగానే ఉన్నట్లు సమాచారం, అలాగని వైసీపీ పైన వ్యతిరేకంగా ఉన్న ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపే ప్రసక్తే లేదనే వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు పాలనపై కూడా ప్రజల్లో స్థిర నిర్ణయం లేదనేది కదనలేని సత్యం, అది గత ఎన్నికల్లో రుజువైంది కూడా. అంతే కాకుండా అంతే కాకుండా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వయసు 72 సంవత్సరాలు, ఎన్నికల నాటికి ఆయన వయసు మరింత పైబడుతుండడంతో భాద్యతలు నారా లోకేష్ చేపట్టే అవకాశం కూడా లేకపోలేదు. అయితే లోకేష్ ను ప్రజలు ఏ స్థాయిలో ఆధారిస్తారనే విషయం కూడా ప్రశ్నార్థకమే ?.. ఇక అప్పుడప్పుడు మెరుపు వేగంతో రాజకీయాల్లో ఇలా మెరిసి అలా కనుమరుగయ్యే పవన్ కల్యాణ్ పై కూడా ప్రజల్లో క్లారిటీ లేదనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు ? .. ఎవరికి చెంపెట్టు పెడతారు ? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read

మహేశ్ బాబు మూవీలో రష్మిక.. పూజాను తప్పించారా.. ?

మరో వివాదంలో అల్లు అర్జున్

షాకింగ్ కామెంట్స్ చేసిన ఇషా గుప్తా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -