Monday, May 6, 2024
- Advertisement -

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. విరిగిన కొండచరియలు!

- Advertisement -

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని రేణి వద్ద ధౌలీగంగా నదికి ఆకస్మికంగా సంభవించిన వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. పర్వత ప్రాంతాల్లోని మంచుచరియలు విరిగిపడడంతో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోయింది. రైనీ గ్రామం తపోవన్‌ వద్ద ఉన్న పవర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. నీటి ప్రవాహం ధాటికి ఆనకట్ట కొట్టుకుపోయింది. దీని ప్రభావంతో చమోలి నుంచి హరిద్వార్ వరకు ముప్పు ముంచుకురావడంతో అధికార బ‌ృందం అప్రమత్తమైంది. కాగా ఎంతమంది మిస్సయ్యారో తెలియడం లేదు. 

సమాచారం అందుకున్న తరువాత, పరిపాలనా బృందం స్పాట్‌కు బయలుదేరింది. అదే సమయంలో, పోలీసులు చమోలి జిల్లా నదీ తీర ప్రాంతాలలో లేక్‌స్పీకర్లను అప్రమత్తం చేస్తున్నారు. ఒక్కసారిగా నీరు చేరడంతో రుషిగంగా పవర్‌ ప్రాజెక్టు దెబ్బతింది. ఈ విద్యుత్‌ కేంద్రంలో 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో 100మందికిపై పైగా మరణించి ఉంటారని అధికారులు అనుమాని స్తున్నారు. నదీ తీరంలో ఉన్న కొన్ని గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

నది పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చమోలీ జిల్లా కలెక్టర్‌ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ విపత్తుపై సమాచారం తెలుసుకున్నారు. మొత్తం పరిస్థితిని ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సంబంధిత జిల్లాలన్నింటినీ అప్రమత్తం చేశారు. గంగా నది ఒడ్డుకు వెళ్లవద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈయ‌నే స‌లార్ విల‌న్.. ఇక సినిమా మాములుగా ఉండ‌దు!

నిమ్మగడ్డ వీడియో సందేశం.. ప్రతి ఒక్కరికీ ఇది..!

నిమ్మగడ్డ కి ఎదురు దెబ్బ..పెద్దిరెడ్డి కి గుడ్ న్యూస్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -