- Advertisement -

బెంగళూరులో విరాట్..ఆర్సీబీలో జోష్

- Advertisement -

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు విరాట్ కోహ్లీ బెంగళూరుకు తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం ఆయన నగరానికి చేరుకోగా, విమానాశ్రయం వద్ద అభిమానులు భారీగా గుమిగూడారు. కోహ్లీని ఒక చూపు చూడడానికి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ చేరడంతో అక్కడ కొంత రద్దీ నెలకొంది. పరిస్థితులు అదుపులో ఉండేలా భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

మాజీ కెప్టెన్ అయిన కోహ్లీ …ఆర్సీబీ జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నారు. గత సీజన్‌లో ఆయన అద్భుత ప్రదర్శనతో జట్టుకు కీలకంగా నిలిచారు. 657 పరుగులు సాధించి, 144.71 స్ట్రైక్ రేట్, 54.75 సగటుతో ఎనిమిది అర్ధశతకాలు నమోదు చేశారు. ఈ ప్రదర్శనతో జట్టుకు బలమైన ఆరంభాలు అందించారు.

గత ఏడాది ఆర్సీబీ తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న నేపథ్యంలో, ఈసారి టైటిల్‌ను కాపాడుకోవాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. అందులో కోహ్లీ పాత్ర మరింత కీలకంగా ఉండనుంది. ఆయన అనుభవం, స్థిరమైన బ్యాటింగ్ జట్టుకు బలాన్నిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ సీజన్‌లో కూడా కోహ్లీ అదే స్థాయి ఫామ్ కొనసాగిస్తారని విశ్వాసం వ్యక్తమవుతోంది. ఆర్సీబీ జట్టు టైటిల్ రేసులో ముందుండే జట్లలో ఒకటిగా భావిస్తున్నారు. అభిమానుల అంచనాలను నిలబెట్టేందుకు కోహ్లీ మరోసారి తన ప్రతిభను నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -