Friday, May 3, 2024
- Advertisement -

బీభ‌త్సం సృష్టిస్తోన్న యాస్ తుపాను.. వీడియో వైరల్

- Advertisement -

తీర ప్రాంతాల్లో రాకాసి తుఫాన్ ‘యాస్’అల్లకల్లోలం సృష్టిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్రరూపం దాల్చింది. బుధవారం ఉదయం అతి తీవ్ర తుఫాన్‌గా మారి మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా తీరాన్ని ఢీకొడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఒడిశాలో తుపాను ప్ర‌భావం అధికంగా వుండడంతో బీభ‌త్సం సృష్టిస్తోంది. చాందీపూర్‌, బాలాసోర్ ప్రాంతాల్లో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డుతోంది. ప‌శ్చిమ బెంగాల్‌లోని దిగా తీరంలో అల‌లు ఉవ్వెత్తున ఎగసిప‌డుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ లోని న్యూ దిఘా బీచ్ వెంబడి సముద్రం నుంచి నీరు నివాస ప్రాంతాలలోకి ప్రవేశిస్తున్నాయి. రాకాసి అలలు పెద్ద ఎత్తున ఉగ్రరూపంతో దూసుకువస్తున్నాయి. రోడ్డుపైకి స‌ముద్ర‌పు నీరు వ‌చ్చేసింది. ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌లోని తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నాయి.

ప్ర‌స్తుతం పారాదీప్‌కు తూర్పు ఈశాన్య దిశ‌గా 90 కిలోమీట‌ర్ల దూరంలో, బాలాసోర్‌కు తూర్పు ఆగ్నేయ దిశ‌గా 50 కిలోమీట‌ర్ల దూరంలో, దిగాకు 90 కిలోమీట‌ర్ల దూరంలో తుపా‌ను కేంద్రీకృత‌మై ఉంది. బాలాసోర్, సాగ‌ర్ ద్వీపం మ‌ధ్య తీరాన్ని తుపాను తాకనుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతోపాటు ఒడిషా, బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పలు రాష్ట్రాల్లో అలర్ట్‌ను జారీ చేశారు. ఇప్ప‌టికే అధికారులు 11 ల‌క్ష‌ల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

టాలీవుడ్ విషాదం.. ‘అనుకోని అతిథి’ నిర్మాత కన్నుమూత

నేటి పంచాంగం,బుధవారం(26-05-2021

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ గా ‘అనుకోని అతిథి’ ట్రైలర్ రిలీజ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -