Saturday, May 4, 2024
- Advertisement -

రియల్‌ లైఫ్‌లో గూండా హీరో..! పోలీసులు సైతం ఆశ్చర్యం..!

- Advertisement -

అతడి వృత్తి గూండాయిజం. మనసు మాత్రం హీరోయిజం. ఏళ్ల తరబడి వ్యభిచార కూపంలో నరకం అనుభవిస్తున్న ఒక బాలికకు…. అతను  విముక్తిని ప్రసాదించాడు. దానికోసమని అతనేదో దౌర్జన్యం చేసాడంటే అలాంటిదేం చేయలేదు.

 

ఎంతో తెలివిగా ఓ ప్లాన్ ను అమలు చేసి ఆ బాలికతో పాటు ఆమె లాంటి ఇంకా 20మంది బాలికలు విడుదల కావడానికి సాయం చేశాడు. 

 విషయంలోకి వద్దాం. ముంబైకి చెందిన ఓ బాలికను 2007లో కొందరు గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసారు. ఆమెను ముంబాయి నుంచి డైరెక్ట్ గా  ఆగ్రాకు తీసుకుపోయి…. అక్కడి కశ్మీర్ బజార్‌లో అమ్మేశారు. తన వద్దకు క్లయింట్‌గా వచ్చిన ఓ గూండాకు ఆ బాలిక తన కష్టానంతా చెప్పుకుని విలపించింది. ఎంత గూండా అయినా…అతనికీ మనసుంటుంది కదా. అది కరిగింది. ఎలాగైనా ఆమెకు సహాయం చేయాలనుకున్నాడు. అందుకోసం ఒక పథకం వేశాడు.     

   ముందుగా ఆమెను అక్కడినుంచి బయటికి తీసుకురావాలంటే అతని ఒక్కడి వల్ల కాదు. ఆ వ్యబిచార కూపాన్ని నడిపే  యజమానురాలిని మచ్చిక చేసుకోవాలి. దానిలో భాగంగా వ్యభిచార గృహానికి తన గ్యాంగ్‌ను కూడా రోజూ క్లయింట్లుగా తీసుకువెళుతూ వ్యభిచార గృహం యజమానురాలి వద్ద బాగా నమ్మకం పెంచుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఓ రోజు ఆ బాలికను అక్కడ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించాడు. గూండా సాయంతో నరకకూపం నుంచి బయటికొచ్చిన ఆ బాలిక ముంబై చేరుకుని….జరిగిన విషయాన్ని మొత్తాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది.

కశ్మీర్ బజార్‌లో తన లాంటి బాలికలు ఎంతో మంది ఉన్నారని, వారందరూ ప్రతిరోజూ నరకం అనుభవిస్తున్నారని ఆ బాలిక కన్నీరు పెట్టుకుంది. వారందరినీ కూడా అక్కడి నుంచి తప్పించాలనుకొంది. వెంటనే బాలిక ముంబై పోలీసులను ఆశ్రయించింది. తాను ఎలా కిడ్నాపయింది.. తనను అక్కడ ఎలా చిత్రహింసలకు గురిచేసింది, అలాగే తనను ఆ గూండా అక్కడి ఎలా తప్పించాడో మొత్తం పోలీసులకు పూసగుచ్చి మరీ వివరించింది.

బాలిక ఇచ్చిన సమాచారం మేరకు ముంబై పోలీసులు ఓ మంచి ఆపరేషన్ చేసారు.. ఆగ్రాలోని కశ్మీర్ బజార్ అంటే లోకల్ పోలీసులు కూడా భయపడతారు. వారు పోలీసులను చంపడానికి సైతం వెనుకాడని వారు. అలాంటి ప్రదేశానికి వెళ్లడానికి ముంబై పోలీసులు నిజంగానే సాహసం చేశారు. ఓ పథకం ప్రకారం అనుకున్నది అనుకున్నట్లుగా సాధించారు. 

కశ్మీర్ బజార్‌లోని వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. దాదాపు 20 మంది బాలికలకు నరకం నుంచి విముక్తి కల్పించారు. దీనికి అక్కడి ఐజీ ఆర్కే మిశ్రా సాయం ఎంతగానో సాయం చేశారు. సైకిల్ కూడా వెళ్లలేని ఇరుకుదారుల్లో వెళ్లి కేవలం 13 నుంచి 15 నిమిషాల్లో ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి విజయం సాధించారు.ఇంతటి రిస్కీ ఆపరేషన్ చేసిన ఆ టీంను  ముంబై పోలీస్ బాస్ ఎంతగానో మెచ్చుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -