న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబడుతున్నారు. అయితే సామాన్యుల సంగతి సరేగానీ లక్షలు, కోట్లలో డబ్బులున్న కార్పోరేట్ వ్యక్తులు, ప్రముఖులు బ్యాంకులకు వెళుతున్నట్టు టీవీల్లో ఎందుకు కనిపించడంలేదు?
వీరికి కొత్త నోట్లు అవసరం లేదా? ఎవరోకరిని పంపించి డబ్బులు మార్చుకుంటున్నారా? లేక బ్యాంకు అధికారులతో పని చేయించుకుంటున్నారా? అనేది ఇప్పుడు సామాన్య ప్రజల సోషల్ మీడియా ప్రశ్న. అయితే నోట్ల మార్పిడి కోసం చివరి తేదీ డిసెంబర్ 30 కాగా, అప్పటికి కూడా మార్చుకోలేకపోతే వచ్చే ఏడాది మార్చి వరకు టైం ఉంది. ఆర్బిఐ కార్యాలయానికి వెళ్లి డిక్లరేషన్ సమర్పించి పెద్ద మొత్తంలో ఉన్నా సరే డబ్బును మార్చుకోవచ్చు. అయితే అందుకు సరైన ఆధారాలు లేని వాళ్ల డబ్బులు మాత్రం మురిగిపోవాల్సిందే. కానీ దీనంతటికీ ఎలాంటి తతంగం నడవనుందో ఎన్ని విచిత్ర సంఘటనలు బయటపడతాయో వేచి చూడాల్సిందే. వ్యాపారులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఇలా అంతా తీరిగ్గా జనవరి నుంచి మార్చి వరకు ఆర్బిఐ బ్యాంకు కార్యాలయాలయాల ముందు క్యూ కడతారన్నమాట. అయితే ఈ నేపథ్యంలో కొన్ని రోజుల తర్వాత పరిస్థితి వేరేలా ఉంటుందనేది బీజేపీ వాదన. చూడాలి మరి పరిస్థితి ఎలా ఉంటుందో, ప్రధాని మోడీ ఇంకా ఎన్ని షాక్‌లిస్తారో..
