Tuesday, April 23, 2024
- Advertisement -

శ్రీలంక .. గట్టెక్కేనా ?

- Advertisement -

ప్రస్తుతం శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనందరికి తెలుసు. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగనికి రీతిలో శ్రీలంక పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, అక్కడి పరిస్థితులు ఏ మాత్రం చక్కబడే అవకాశాలు కనిపించడం లేదు. నిదుల కొరత, నిత్యవసర ధరల పుంపు, ఆర్థిక లోటు ఇలా అన్నీ వైపులా నుంచి సమస్యలు శ్రీలంకను కుదిపేస్తున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల తినడానికి కూడా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. శ్రీలంకలో పరిస్థితులు ఇంత దారుణంగా మారడానికి ప్రభుత్వమే కారణమని, మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తోన్న ఉద్యమంతో లంక అట్టుడుకుతోంది.

2.19 కోట్ల జనాభా కలిగిన శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితులు తట్టుకోలేక ఆ దేశ ప్రజలు ఇతర దేశాలకు వలసల బాటా పడుతున్నారు. అయితే ఈ తీవ్ర సంక్షోభం నుంచి లంక బయటపడాలంటే..ఇంధనం మరియు మందులతో సహా అవసరమైన వస్తువుల సరఫరాలను పునరుద్ధరించడంలో సహాయపడటానికి..వచ్చే ఆరు నెలల్లో 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమని శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సర్బీ ఆ మద్య తెలిపిన సంగతి విదితమే. అయితే వచ్చే మూడు నెలల్లో 3 బిలియన్ డాలర్స్ ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొఛే దేశాలు కనిపించడంలేదు. ఎందుకంటే ఇప్పటికే శ్రీలంక ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నుంచి 14.3 శాతం, జపాన్‌ నుంచి 10.9, చైనా నుంచి తీసుకున్నది 10.8 శాతం ఉంది.

మిగతా రుణాలను మన దేశం, ప్రపంచబ్యాంకు, ఇతర సంస్ధలు, దేశాల నుంచి తీసుకున్నది. శ్రీలంక బాండ్ల రుణాల్లో ఎక్కువ మొత్తం అమెరికా సంబంధిత సంస్ధల నుంచి తీసుకున్నదే, దాంతో ఇప్పటికే చెల్లించాల్సిన విదేశీ అప్పులే భారీగా ఉన్నాయి. అంతే కాకుండా శ్రీలంక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఒకవేళ అప్పు ఇచ్చిన తిరిగికట్టే స్థోమత లో శ్రీలంక లేదు. ఎందుకంటే ఆ దేశ ఆదాయ వనరులు కూడా అడుగంటాయి. శ్రీలంక ప్రధాన ఆదాయ వనరు టూరిజం, కరోనా కారణంగా శ్రీలంక టూరిజానికి భారీగా గండి పడింది. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీలంక ను దర్శించేందుకు టూరిస్టులు సైతం వెనకడుగు వేస్తున్నారు. అయితే గతంలో కూడా శ్రీలంకకు సంక్షోభం కొత్త కాకపోయినప్పటికి, ఈ ఏడాది తలెత్తిన సంక్షోభం ఏకంగా దేశన్నే దివాళా తీసేలా చేసింది. అయితే శ్రీలంకలో పరిస్థితి చక్కబడుతుందా ? అంటే ఇప్పట్లో కష్టమే అని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పెను సంక్షోభంలో పాకిస్తాన్ ..గట్టెక్కేనా ?

భారత్ కు షాక్ ఇస్తున్న,, ఆస్ట్రేలియా బొగ్గు సంక్షోభం !

సంచలన నిర్ణయంతో చైనా.. ఆందోళనలో ఆయా దేశాలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -