Saturday, April 20, 2024
- Advertisement -

విద్యుత్ సంక్షోభంలో ఆస్ట్రేలియా.. భారత్ కు పెను ముప్పు ?

- Advertisement -

ప్రస్తుతం కొన్ని దేశాలు.. కొన్ని రకాల సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మొన్న ఇరాక్, నిన్న శ్రీలంక.. ఇప్పుడు ఆస్ట్రేలియా.. ఇలా ఆయా దేశాలు ఊహించని సంక్షోభాలతో కూరుకుపోతున్నాయి. శ్రీలంక పరిస్థితి ఎంత దయనీయ స్థితిలో ఉందో మానందరం చూస్తూనే ఉన్నాం. తినడానికి కూడా ఆహారం దొరకని క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక ఉంది. శ్రీలంకను ఆర్థిక సంక్షోభం కుదిపేస్తుంటే, ప్రస్తుతం ఆస్ట్రేలియాను విద్యుత్ సంక్షోభం నిద్ర లేకుండా చేస్తోంది. ఆ దేశంలో బొగ్గు నిల్వలు అధికంగా ఉండడంతో దాదాపుగా 65 శాతం బొగ్గు ద్వారానే విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా లో తలెత్తిన వరదల కారణంగా బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

దీంతో ఒక్కసారిగా బొగ్గు సరఫరాలో తీవ్రమైన అంతరాయలు తలెత్తాయి. దీంతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశాయి. దాంతో న్యూ సౌత్ వేల్స్ వంటి రాష్ట్రాలలో సాయంత్రం 6 నుంచి 8 గంటల మద్య అవసరం లేని విద్యుత్ వాడకాన్ని నిలిపివేయాలని ఆస్ట్రేలియా ఇందన మంత్రిత్వ శాఖ మంత్రి క్రిస్ బ్రోవెన్ స్వయంగా కోరారంటే విద్యుత్ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం న్యూ సౌత్ వేల్స్ లోనే కాక వాణిజ్య నగరం గా పేరుపొందిన సిడ్నీ లో కూడా విద్యుత్ ను పొదుపుగా వాడాలని సూచిస్తున్నారట. అయితే ఆస్ట్రేలియాలో బొగ్గు ఉత్పత్తి లో తలెత్తిన అవాంతరాలతో ఆ ప్రభావం భారత్ పై కూడా పడే అవకాశం లేకపోలేదు.

ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఎగుమతి దారుల్లో ఆస్ట్రేలియా ఒకటి. దాంతో మనదేశం కూడా ఆస్ట్రేలియా నుండి బొగ్గును భారీగా దిగుమతి చేసుకుంటుంది. ఎందుకంటే మన దేశంలో 45 శాతం ఒక్క బొగ్గు ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దాంతో భారత్ లో బొగ్గు వినియోగం అధికంగా ఉండడం వల్ల ప్రపంచ దేశాలన్నిటిలోకెల్లా అతిపెద్ద బొగ్గు దిగుమతి దారుగా రెండవదిగా భారత్ ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మన దేశానికి భారీగా బొగ్గు ఎగుమతి చేస్తోంది. ఆ దేశంలో ఇప్పుడు ఏర్పడ్డ బొగ్గు గనుల్లో అంతరాయం వల్ల భారత్ కు ఎగుమతి చేసే బొగ్గు శాతం తగ్గుతుంది. అది మన దేశంపై గట్టిగానే ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఆస్ట్రేలియాలో ఏర్పడ్డ ఈ బొగ్గు సంక్షోభం ఎప్పుడు క్లియర్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

చైనా అధ్యక్షుడికి నో రిటైర్మెంట్ ..?

లైసన్స్ లేకున్నా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు !

భారత్ అంటే రష్యాకు ఎంత ప్రేమో !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -