Tuesday, April 23, 2024
- Advertisement -

పీకల్లోతు కష్టాల్లో పాక్.. దివాళా అంచున దేశం ?

- Advertisement -

ప్రస్తుతం మన దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రోజురోజుకూ క్షీణిస్తున్న ఆదాయ వనరులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడంతో దేశం దివాళా అంచున నిలిచింది. ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేయడంలో విఫలం అయిన గత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తప్పుకొని చేతులెత్తేశారు. ఇక ప్రస్తుత ప్రధాని షెఃబాజ్ ష్రాఫ్ కూడా ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించడంలో తడబడుతూనే ఉన్నారు. ఏదైనా ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని ఆ దేశంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వలతో అంచనా వెయ్యొచ్చు.

పిబ్రవరిలో 1600 కోట్ల విదేశీ డాలర్ నిల్వలు ఉంటే.. జూన్ నాటికి వెయ్యి కోట్ల డాలర్లకు పడిపోయింది. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ రూపి విలువ దారుణంగా పడిపోయింది. ఒక యుఎస్ డాలర్ ఈక్వల్ 205 పాకిస్తాన్ రూపీస్ కు సమానం అయ్యింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ లో ఆర్థికలోటు ఏ స్థాయిలో ఉందన్నది. ఇక ప్రస్తుతం విదేశాల నుండి ఏవైనా దిగుమతులు చేసుకునేందుకు విదేశీ మారక నిల్వలు చాలా తక్కువగా ఉండడంతో.. ఉన్న విదేశీ నిల్వలు కేవలం రెండు నెలలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 209, డీజిల్ ధర రూ. 204కు చేరింది.

దీంతో సామాన్యుడు చతికిల పడుతున్నాడు. ప్రభుత్వం మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. దేశంలో ధరలు ఇలా పెరిగితే భవిష్యత్ లో మరిన్ని కష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మద్యకాలంలో పాకిస్తాన్ లో పెట్రోల్ ధరలు ఏకంగా రూ. 60 మేర పెరడం ఆందోళన కలిగింఛే విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు స్నేహహస్తం అందించాలని సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలను అభ్యర్థిస్తోంది పాకిస్తాన్. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి కూడా సాయం చేయాలని కోరుతోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉండటంతో ఏ దేశం కూడా సాయం చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకమే. దీంతో పాకిస్తాన్ మరింత అగాధంలోకి పడిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

విద్యుత్ సంక్షోభంలో ఆస్ట్రేలియా.. భారత్ కు పెను ముప్పు ?

చైనా అధ్యక్షుడికి నో రిటైర్మెంట్ ..?

భారత్ అంటే రష్యాకు ఎంత ప్రేమో !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -