Friday, April 26, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కే‌సి‌ఆర్ మద్య ఏం జరుగుతోంది ?.. అసలు ఈ వివాదం ఎందుకు ?

- Advertisement -

గత రెండు రోజులుగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు.. రాజకీయ వర్గాల్లోనూ కేవలం ఇద్దరి గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. వాళ్ళు ఎవరో కాదు. జూ. ఎన్టీఆర్ మరియు తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్. అసలు వీరిద్దరి గురించి ఎందుకింత చర్చ జరుగుతోంది ? అసలు వీరిద్దరి మద్య చిచ్చు పెట్టిన అంశాలేమిటి ? నిజంగానే తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ జూ.ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్నారా ? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం విపరీతంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన ” భ్రహ్మాస్త్రం ” మూవీ ప్రమోషన్ లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్.. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించింది చిత్రయూనిట్.

అయితే ఈవెంట్ కు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నా తరువాత.. బందోబస్తు ఇవ్వలేమంటూ తెలంగాణ పోలీసులు చేతులెత్తేయడంతో చేసేదేమీ లేక చివరి నిమిషంలో ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది చిత్రా యూనిట్. అయితే ముందుగా ఈవెంట్ కు అనుమతించిన పోలీసులు.. చివరి నిముషంలో అనుమతి ఇవ్వలేమని చెప్పడంతో ఈ వ్యవహారంపై రాజకీయం పులుముకుంది. సి‌ఎం కే‌సి‌ఆర్ ఈవెంట్ క్యాన్సిల్ చేయించాడంటూ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. అంతే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా పరోక్షంగా ట్విట్టర్ లో కే‌సి‌ఆర్ కు చరకలు అంటించడంతో ఈ వివాదంపై మరింత అగ్గి రాజుకుంది. నందమూరి కల్యాణ్ రామ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ” FEAR “..అని సింగిల్ వర్డ్ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ కే‌సి‌ఆర్ ను ఉద్దేశించే కల్యాణ్ రామ్ ట్వీట్ చేశాడని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఎప్పుడు తన వ్యాఖ్యలతోనూ, ట్విట్ల తోనూ వేడి పుట్టించే బండ్ల గణేశ్ కూడా ” ఐ లవ్ యూ కే‌సి‌ఆర్ సార్.. మీరు టైగర్ ( ఎమోజీ ) ” అని ట్వీట్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు బండ్ల పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.. అయితే కే‌సి‌ఆర్ పై వ్యంగ్యంగా ఆ ట్వీట్ చేశారని మరికొందరు బండ్ల గణేశ్ ను సమర్తిస్తున్నారు. ఇంతకీ కే‌సి‌ఆర్ వర్సస్ ఎన్టీఆర్ వివాదం చెలరేగడానికి అసలు కారణం.. ఏమిటంటే ఇటీవల జూ. ఎన్టీఆర్ తో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరి మద్య ఎలాంటి చర్చ జరిగిందనే దానిపై స్పష్టత లేనప్పటికి.. ఎన్టీఆర్ బీజేపీకి మద్దతుగా నిలుస్తాడనే వార్తలు మాత్రం గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే బీజేపీపై అగ్గి మీద గుగ్గిలం అయ్యే కే‌సి‌ఆర్.. ఎన్టీఆర్ అమిత్ షా తో బేటీ కావడం నచ్చలేదని.. అందుకే తారక్ ను సి‌ఎం కే‌సి‌ఆర్ టార్గెట్ చేస్తున్నాడనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ వివాదంపై కే‌టి‌ఆర్ గాని, టి‌ఆర్‌ఎస్ నేతలు గాని ఇంతవరకు ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -