Monday, May 13, 2024
- Advertisement -

పండగలా దిగివచ్చాడు

- Advertisement -

తెలంగాణలో పార్టీకి ఓ మైలేజ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు.. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మంచి బూస్ట్ ఇచ్చారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో.. పార్టీ గెలుస్తుందో లేదో పక్కన పెడితే… వైసీపీ నుంచి బరిలో నిలిచిన నల్లా సూర్యప్రకాశ్ కోసం జగన్ వరంగల్ వెళ్లారు.

పార్టీ అభ్యర్థి తరఫున నాలుగు రోజుల ప్రచారానికి జగన్ ప్లాన్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ కార్యక్రమాల కోసం వరంగల్ జిల్లాకు వెళ్లని జగన్.. ఇప్పుడు కనీసం ఉప ఎన్నిక పేరుతో అయినా రావడంతో… కేడర్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

రీసెంట్ గా.. జగన్ సోదరి షర్మిల జిల్లాకు రావడం.. యాత్ర చేయడంతో రాజకీయంగా కాస్త కదలిక వచ్చిన కార్యకర్తలు.. ఇప్పుడు ఏకంగా జగన్ రావడంతో సంబరపడిపోతున్నారట. ఉప ఎన్నికలో అన్ని పార్టీల మాదిరే ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు.. జగన్ ప్రభావంతో తమ ఓటింగ్ షేర్ పెంచుకునే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారట.

అయితే.. వైసీపీ నేతలు, కార్యకర్తల ఉత్సాహాన్ని కాంగ్రెస్ నేతలు నీరుగారుస్తున్నారు.వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో జగన్ టూర్.. టీఆర్ఎస్ కు మేలు చేసేందుకే అన్నది తెలంగాణ కాంగ్రెస్ నేతల వాదన. ఉప ఎన్నికలో ఓట్లు చీల్చి.. టీఆర్ఎస్ కు మేలు చేసేందుకే.. వైసీపీని బరిలో దింపారన్నది హస్తం పార్టీ నాయకుల అంచనా.

అయితే.. ఇదంతా ఉత్త ముచ్చటే అని వైసీపీ నాయకులు కొట్టి పారేస్తున్నారు. జగన్ ప్రభావంతో తమ అభ్యర్థి మంచి ఫలితం సాధిస్తాడని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -