- Advertisement -

ఎస్పీవై రెడ్డి మృతికి సంతాపం తెలిపిన‌ జ‌గ‌న్‌,చంద్ర‌బాబు, ప‌వ‌న్‌

- Advertisement -

నంద్యాల లోక్ సభ సభ్యుడు, జనసేన నేత ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయ‌న మృతికి ప‌లువురు సంతాపం తెలిపారు. ఇటీవల ఏపీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున నంద్యాల నుంచి పోటీచేశారు. ఎస్పీవై రెడ్డి మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నంది గ్రూప్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు ఎస్పీవై రెడ్డి (69) కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -