- Advertisement -

దాడి త‌ర్వాత అభిమానుల‌కు జ‌గ‌న్ ట్వీట్‌…

- Advertisement -

విశాఖ ఎయిర్ పోర్ట్ లో కత్తిపోటుకు గురైన వైసీపీ అధినేత జగన్ భుజానికి చికిత్స జరుగుతోంది. హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. కాగా, జగన్ భుజానికి తగిలిన గాయానికి మూడు కుట్లు వేసినట్టు తెలుస్తోంది. అయితే క‌త్తికి ఏదైనా విష‌ప‌దార్థం పూసి ఉంటారనేది బ్ల‌డ్ ప‌రీక్ష‌ల త‌ర్వాత‌నే తేల‌నుంది.

మ‌రో వైపు తనపై జరిగిన దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని వైఎస్ జగన్ ట్విట్ట‌ర్‌లో కోరారు. భగవంతుడి దయ, కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయంటూ ఓ ట్వీట్ చేశారు. ఇటువంటి పిరికిపందల చర్యలు తన ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయలేవని, ప్రజా సంక్షేమం కోసం తాను చేసే పోరాటాలను ఆపలేవని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -