Saturday, May 11, 2024
- Advertisement -

అన్నివర్గాల ప్రజలకు ఇబ్బందులు : వై ఎస్ జగన్

- Advertisement -

వైకాపా అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర మంగళవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. కడప జిల్లాలో వారం రోజుల పాదయాత్ర ముగించుకుని ఆయన ఈరోజు ర్నూలు జిల్లాలో అడుగుపెట్టారు. ఆళ్లగడ్డ మండలం చాగలమర్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి కోసం సమష్టిగా కష్టపడదామని పిలుపు నిచ్చారు. ఏం అడిగినా చంద్ర బాబు పాడిందే పాటగా విభజన కష్టాల గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల వారూ ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు .అమ్మఒడి పథకం ద్వారా పిల్లలకు ఉన్నతవిద్య అధిస్తాం. పేద విద్యార్థులకు మెస్ ఛార్జీల కోసం రూ. 20 వేలు ఇస్తామని అన్నారు. 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛను అందజేస్తామని అన్నారు. టిడిపి ప్రభుత్వం లో రైతులకు మద్దతు ధరలు ఎక్కడని ప్రశ్నించారు. చంద్రబాబుది మాటల ప్రభుత్వం. బాబు మాటలు మాత్రమే చెప్పారని ఎద్దేవా చేసారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే చెప్పినవే కాదు.. చెప్పనివి కూడా చేస్తాం. రాష్ట్ర ప్రజకలు సుపరిపాలన అందిస్తామన్నారు.

ఎవర్ని అడిగినా నష్టపోయాం అనే మాట వినిపిస్తోంది. రైతన్నలను తీసుకుంటే వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ కాలేదు. అప్పులు కట్టొద్దని చెప్పి ఇప్పుడే ప్లేటు ఫిరాయించారు. చంద్రబాబు. రైతులను పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయేలా చేశారు. నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా.. ఆయన చేసిన రుణ మాఫీ వడ్డీలకైనా సరిపోయిందా?. అని విమర్శించారు. పొదుపు సంఘాలకు ఇచ్చిన రుణాలు మాఫీ చేస్తా అన్నారు. కానీ ఒక్క రూపాయైనా కూడా మాఫీ కాలేదు…. అక్కచెల్లెలమ్మల ఉసురు తగులుతుందన్న ధ్యాసే లేదు సీఎంకి. జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు. 2 వేల రూపాయలు ఇస్తా అన్నారు కదా. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రూ. 90 వేలు బాకీ పడ్డారు. ఇప్పటికీ ఒక్క రూపాయైనా ఇవ్వలేదు. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు పాలన కొనసాగిస్తున్నారని జగన్ మండి పడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -