Thursday, April 18, 2024
- Advertisement -

వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో సింగిల్‌గా మెజార్టీ సాధించి అధికారంలోకి వ‌స్తుంది….

- Advertisement -
Internal Surveys: YSRCP form government in 2019 elections

ఎన్నికలలు ఇప్ప‌ట్లో లేవు. ఇంకా రెండు సంవ‌త్స‌రాల టైం వుంది. అయినప్పటికి అప్పుడే ఆయా పార్టీల తీరు చూస్తుంటే అప్పుడే ఎన్నికలు వచ్చేట్లుగా కనిపిస్తోంది.2019 ఎన్నిక‌ల్లో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌ని ఇప్ప‌టినుంచే స‌ర్వేలు నిర్వ‌హించుకుంటున్నాయి.ఈస‌ర్వేల‌ల్లో ఏపీలో అధికార పార్టీ టీడీపీకి వ్య‌తిరేక ఫ‌లితాలు వ‌స్తుండ‌టంతో బాబుకు మైండ్ బ్లాక్ అయ్యింది.

అయితే, ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై సర్వేలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో తమకు 111 సీట్లు వస్తాయని ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఏపీలోను ఆయా పార్టీలు సర్వేలు చేసుకుంటున్నాయని తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA1}

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో్ అధికారం ఎవ‌ర‌నేదాన‌పై ప‌లు సంస్త‌లు స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నాయి.ఈస‌ర్వేల‌ల్లో విత్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తీవ్ర‌వ్య‌తిరేక‌త‌తో ఉండ‌టంతోపాటు …వైసీపీకి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతార‌ని స‌ర్వేలల్లో నిజాలువెల‌గు చూశాయి.
ప్ర‌ధానంగా బాబుపై వ్య‌తిరేక‌త రావ‌డానికి రాజధాని నిర్మాణం కదలకపోవడం, ఇచ్చిన హామీలు అనుకున్న స్థాయిలో నెరవేర్చకపోవడం, ప్రత్యేక హోదా అంశం తదితర కారణాలతో టిడిపిపై వ్యతిరేకత ఉందని సదరు సర్వేలో తెలిసిందని అంటున్నారు.అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా ఈ సర్వేలో తేలిందని అంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసినా ప్రభుత్వ ఓటు మాత్రమే చీలుతుందని, అప్పుడు వైసిపికి లబ్ధి చేకూరుతుందని అంటున్నారు.

{loadmodule mod_custom,GA2}

పవన్ కళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ద‌ని అంతో ఇంతో ఓటు బ్యాంకు మాత్ర‌మే వెల్తుంద‌ని స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో జనసేన ప్రభావం అంతగా లేదని ఈ సర్వేలో తేలింది అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గా మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలో తేలిందని చెబుతున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -