Wednesday, May 1, 2024
- Advertisement -

మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత మేల్కొన్న కాంగ్రెస్ అధిష్టానం

- Advertisement -
Congress Party Guntur meeting For existence in Andhra Pradesh

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. పార్లమెంటు డోర్లు మూసివేసి మరీ రాష్ట్ర విభజన బిల్లుని ఆమోదించారు. ప్రజలకు తీరని అన్యాయం చేశారు. వంచనలు, అవమానాలతో అడ్డగోలుగా విభజించారు.

మొత్తంగా ఏపీ ప్రజల గొంతులు కోశారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్రంగా మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెసే. అలాంటి పార్టీ ఇప్పుడు మళ్లీ ఏపీ ప్రజలను ఉద్దరిస్తామని ముందుకు వచ్చింది.

{loadmodule mod_custom,GA1}

కాంగ్రెస్ అధిష్టానానికి మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత జ్ణానోద‌యం క‌లిగిన‌ట్లుంది.రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా ….పార్ల‌మెంట్‌లో త‌లుపులు వేసి విభ‌జించిన కాంగ్రెస్ రెండుతెలుగు రాష్ట్రాల్లో ఏగ‌తి ప‌ట్టిందో అంద‌రికి తెలిసిందే.తెలంగాణాలో కొంత వ‌ర‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్నా….ఏపీలో మాత్రం ఆపార్టీకి ప్ర‌జ‌లు పాత‌వేశారు.కాని ఇప్పుడు మాత్రం ప్రజ‌ల‌మీద ప్రేమ పుట్టుకొచ్చింది.
అందుకే కాంగ్రెస్ పార్టీ గుంటూరులో ‘ప్రత్యేక హోదా భరోసా’ సభ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ,, స్పెషల్ స్టేటస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఆయన నినదించారు. రాష్ట్రాన్ని విభ‌జించే ట‌ప్పుడు ప్ర‌జ‌ల ఆకాంక్ష గుర్తుకు రాల‌దా …?అంతేకాదు.. 2019లో తాము అధికారంలోకి వస్తామని, ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్ వ్యాఖ్యానించారు. తాము పవర్ లో రాగానే ప్రత్యేక హోదా ఫైల్ పైనే తొలి సంతకం పెడతామన్నారు.

{loadmodule mod_custom,GA2}

నిజానికి, ఏపీకి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అనేది ప్రజల అభిప్రాయం. ఒక ప్రణాళిక అంటూ లేకుండా, హేతుబద్దత అనేది లేకుండా రాత్రికి రాత్రి రాష్ట్రాన్ని విడగొట్టేశారు. విభజన జరిగితే ఏపీకి జరిగే అన్యాయం గురించి అస్సలు ఆలోచన చేయలేదు. అందించాల్సిన సాయం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్ప‌టికే ఏపీలో త‌మ ఉనికినే కోల్పోయిన పార్టీ ..ఇప్పుడేమో ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని బ‌హిరంగ స‌భ‌లు పెట్టి క‌నీసం పార్టీ ఉందంటూ త‌మ ఉనికిని చాటుకొనేందుకు ఆ ప్ర‌య‌త్నాలు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -