Wednesday, April 24, 2024
- Advertisement -

విస్తరిస్తోన్న ఆప్.. సౌత్ లో పాగా వేసేనా ?

- Advertisement -

సామాజిక సంఘసంస్కర్త అన్నా హాజరే స్పూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ మెల్లమెల్లగా తన పరిదిని విస్తరించుకుంటుంది. అరవింద్ కేజృవాల్ నాయకత్వంలో అప్.. జాతీయ పార్టీలకు కూడా తక్కువ టైమ్ లోనే బలమైన ప్రత్యర్థి పార్టీగా ఎదుగుతోంది. ముందుగా డిల్లీలో మొదలైనా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం.. మెల్లమెల్లగా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే డిల్లీతో పాటు పంజాబ్ లో కూడా జెండా పాతిన కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాలపై కూడా గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా మద్య ప్రదేశ్ లో కూడా కాలు మోపిన ఆమ్ ఆద్మీ అక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటింది. మద్య ప్రదేశ్ లోని సింగ్రాలి మున్సిపల్ ఎన్నికల్లో అప్ అభ్యర్థి రాణి అగర్వాల్ .. బీజేపీ అభ్యర్థి అయిన ప్రకాష్ విశ్వకర్మ పై 9,352 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల గెలుపుతో అప్ విస్తరణ మద్య ప్రదేశ్ లో కూడా గ్రాండ్ గానే సక్సస్ అయింది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ వంటి బలమైన పార్టీలకు షాక్ ఇస్తూ మద్య ప్రదేశ్ మున్సిపాల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి సారి గెలిచింది.

ఇక రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా అన్నీ రాష్ట్రాలలో విస్తరింపజేయాలనే లక్ష్యంతో కేజృవాల్ గట్టిగానే ప్రణాళికలు వేశారు. ఇక నెక్స్ట్ ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటలని కేజృవాల్ భావిస్తున్నారు. అదే గనుక జరిగితే మరో జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించడం ఖాయం. ముఖ్యంగా అప్ విధానాలకు ప్రజలు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు.. ఎందుకంటే పంజాబ్ లో ఆమ్ ఆద్మీ విజయాన్ని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమౌతుంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ విస్తరణ చూస్తుంటే.. సౌత్ లో కూడా పాగా వేయడం ఎంతో దూరం లేదని అర్థమౌతుంది.

ఇవి కూడా చదవండి

మోడీజీ.. అవికూడా భూతులేనా ?

“భగత్ సింగ్ దేశ ద్రోహి”.. మరి నువ్వు ?

ఉచితలు తెచ్చి పెట్టిన వివాదాలు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -