Wednesday, April 24, 2024
- Advertisement -

ఫ్రీడం ఫైటర్స్ ను తీడితే పబ్లిసిటీ పెరుగుతుందా ?

- Advertisement -

ఇటీవల కాలంలో స్వతంత్ర సమరయోధులను తిట్టడం ఫ్యాసన్ గా మారిపోయింది. తక్కువ టైంలో ఎక్కువ పబ్లిసిటీ తెచ్చుకోవాలంటే దేశం కోసం పోరాడిన వీరులను టార్గెట్ చేయడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు చాలా మంది రాజకీయ నేతలు. పరాయి పాలన నుంచి దేశాన్ని రక్షిచేందుకు అహర్నిశలు శ్రమించి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన స్వతంత్ర సమరయోధులను కూడా వారి రాజకీయ జీవితం కోసం తిట్టే రాజకీయ నేతలు మన దేశంలో ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి. మహాత్మా గాంధీ ని తట్టడం, ఆయనను చంపిన గాడ్సే ను పొగడడం, సుభాష్ చంద్రభోస్ విధానాలను విమర్శించడం, జవాహర్లాల్ నెహ్రూ ను దూషించడం, సర్ధార్ వల్లభాయ్ పటేల్ ను కించపరచడం..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి స్వతంత్ర సమరయోధుడిని తిడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు చాలా మంది నేతలు. అది తప్పు అని తెలిసిన ఫ్రీడం ఫైటర్స్ ను దూషించడం మాత్రం మానడం లేదు..

ఇటీవల పంజాబ్ ఎంపీ శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సిమ్రాన్ జిత్ సింగ్ .. భగత్ సింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భగత్ సింగ్ ఒక ఉగ్రవాది అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. భగత్‌సింగ్‌ ఓ యువ ఆంగ్ల నౌకాదళాధికారిని హత్య చేశాడని…. సిక్కు కానిస్టేబుల్ చన్నన్ సింగ్‌ను హతమార్చాడని, అంతే కాకుండా జాతీయ అసెంబ్లీపై బాంబు విసిరాడని,. ఈ చర్యలను బట్టి చూస్తే భగత్‌సింగ్ కచ్చితంగా ఉగ్రవాదేనంటూ సిమ్రన్‌జిత్‌ కాంట్రవర్సీ కి తెరతీశాడు. అయితే సిమ్రాన్ జిత్ చేసిన వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా చాలా మంది ఖండిస్తున్నారు. భగత్ సింగ్ దేశ ద్రోహి కాదని.. ఆయనను తిడుతున్న సిమ్రాన్ జిత్ అసలైన దేశ ద్రోహి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భగత్ సింగ్ ను అవమాన పరిచినందుకు సిమ్రాన్ జిత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంచితే అసలు స్వతంత్ర సమరయోధులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. దీన్ని బట్టి చూస్తే కేవలం పబ్లిసిటీ తెచ్చుకోవడానికి తప్పా .. వేరే ఉద్దేశం కనిపించాదు. ఏది ఏమైనప్పటికి దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను తిట్టడం నేరం.. ఇలాంటి దుశ్చర్యకు ఎంకెవ్వరు పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. .

ఇవి కూడా చదవండి

సరిహద్దు రచ్చ.. సద్దుమనిగేనా ?

పతనమైన రూపాయి.. దేనికి సంకేతం !

ప్లాస్టిక్ కు చెక్.. సరికొత్త రోబో టెక్నాలజీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -