మద్యపాన నిషేదం.. ఇక లేనట్లే !

- Advertisement -

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఘంటాపథంగా పదే పదే చెప్పుకుంటూ వచ్చిన మాట మద్యపాన నిషేదం. మొదట సంపూర్ణ మద్యపాన నిషేదం తథ్యం అని హామీ ఇచ్చిన జగన్..ఆ తరువాత దశల వారీగా మద్యపాన నిషేదం చేస్తామని మాటమార్చారు. 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో అప్పటికే ఉన్న 4,380 వైన్ షాపులు ఉండగా వాటిని 3,500 కు తగ్గించటంతో పాటు వీటిని ప్రభుత్వమే నడపేలా చర్యలు తీసుకున్నారు.

ప్రతి సంవత్సరం 20% వైన్ షాపులను తగ్గిస్తూ ఐదేళ్ళ కాలంలో పూర్తిగా వైన్ షాపులను ఎత్తేస్తామంటూ అప్పట్లో ప్రభుత్వం ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతే కాకుండా మద్యం తాగాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు కల్పిస్తామని జగన్ ధీమాగా చెప్పుకొచ్చారు, పెద్దపెద్ద మాల్స్, ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చేస్తామని అక్కడకూడా ధరలు భారీగా ఉండేలా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

సీన్ కట్ చేస్తే సంపూర్ణ మద్యపాన నిషేదం కాదుకదా..! కనీసం మద్యాన్ని ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు కూడా మానుకుంది జగన్ సర్కార్. తాజాగా మూడేళ్ళ కాలనికకి కొత్త బార్ పాలసీ విధానాలను ప్రవేశ పెట్టింది జగన్ ప్రభుత్వం. ఈ విధానంతో సంపూర్ణ మద్యపాన నిషేడానికి ఇక మంగళం పడినట్లేనని తెలుస్తోంది. కొత్త పాలసీలో ఇచ్చే లైసెన్సుల గడువు మూడేళ్లపాటు ఉంటుందని, ఏటా 10శాతం లైసెన్సు ఫీజు పెరుగుతుందని వివరించింది. అయితే కొత్త పాలసీ నిబంధనల్లో ఎక్కడా కూడా మద్యపాన నిషేధంపై ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో మద్యపాన నిషేదం హామీని సి‌ఎం జగన్ గాలికి వదిలేసినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

బాబుకు దిక్కు ..ఎన్టీఆరే ?

జగన్ కు మరో తలనొప్పి ?

మహానాడు ఇచ్చిన జోష్ కొనసాగేనా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -