Thursday, April 25, 2024
- Advertisement -

ఎన్టీఆర్ జపం చేస్తోన్న..చంద్రబాబు ?

- Advertisement -

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయిడు ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గెలుగు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలేల కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని మర్చిపోయేలా రాబోయే ఎన్నికల్లో విజయ ఢంఖా మోగించాలని ఉవిళ్లురుతున్నారు. అందుకే ఇప్పటి నుంచే కొత్త వ్యూహాలతో, సరికొత్త ప్రణాళికలతో ప్రజల్లోకి వెళుతున్నారు. మొన్న మహానాడు, నెక్స్ట్ బస్సు యాత్ర అంటూ నాన్ స్టాప్ గా జోరు చూపిస్తున్నారు. ఇదిలా ఉంచితే రాజకీయాల్లో అపార చాణక్యుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబుపై ప్రజల్లో పాజిటివిటీ కన్నా నెగిటివిటీ నే ఎక్కువగా ఉంది అనే విషయం జగమెరిగిన సత్యం.

ముఖ్యంగా బాబు గురించిన ప్రస్తావన వచ్చినపుడల్లా ఇతర పార్టీల నేతలు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి చంద్రబాబు చేసిన ద్రోహాన్ని, వెన్నుపోటు విషయాన్ని పదే పదే లేవనెత్తడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన విషయంలో ఎదురవుతున్న విమర్శలపై ఎప్పుడు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చెయ్యరు. అలాగే పార్టీ మీటింగ్స్ లోనూ, భహిరంగ సభలలోనూ ఎక్కువ ఎన్టీఆర్ గురించి మాట్లాడే ప్రయత్నం చెయ్యరు. కానీ ప్రస్తుతం చంద్రబాబు ఎన్టీఆర్ జపం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ను కూడా గట్టిగానే వినిపిస్తున్నారు చంద్రబాబు.

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం చంద్రబాబు.. ఎన్టీఆర్ ను హైలెట్ చెయ్యడం వెనుక ..రాజకీయ వ్యూహం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు పేరు చెబితే ప్రజలు ఓట్లు వేసే పరిస్థితిలో లేరని, అందుకే స్వర్గీయ నడమూరి తారకరామారావు పేరును చద్రబాబు వాడుకుంటున్నారని వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. మరి చంద్రబాబుకు ఇలాంటి విమర్శలు కొత్తేమీ కాదు. పార్టీ గెలుపుకోసం ఎలాంటి వ్యూహాలైన రచించడంలో చంద్రబాబు సిద్దహస్తుడు అనే సంగతి ఏపీ ప్రజలకు బాగానే తెలుసు. మరి చంద్రబాబు చేస్తోన్న ఎన్టీఆర్ జపం ఎంతవరకు ఫలిస్తోందో చూడాలి.

ఇవి కూడా చదవండి

నేతల బూతు పురాణం..జగన్ కు తలనొప్పి !

విపక్షాలు బీజేపీని నమ్ముతాయా ?

వైసీపీ లో జంపింగ్ జపాంగ్ ..షురూ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -