Saturday, May 4, 2024
- Advertisement -

అలవోక గా కాదు అసలు గెలుస్తారా..దుబ్బాక లో టీఆరెస్ విషయమెంత..?

- Advertisement -

తెలంగాణ లో ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్న దుబ్బాక ఉప ఎన్నికపై ఇప్పుడు అంతర చర్చ జరుగుతుంది.. అన్ని పార్టీ లు ఈ ఎన్నిక ని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా కెసిఆర్ ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని పార్టీ కి సూచనలు ఇచ్చారట.. అయితే ఇక్కడ ఈజీ గా గెలుస్తామని అధికార పార్టీ తెరాస అనుకుంది.. కానీ కాంగ్రెస్ , బీజేపీ పార్టీ లు సైతం ఇక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంతో ఇక్కడ రసవత్తర రాజకీయం తప్పదని తెలుస్తుంది..

కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధమే అని ప్రకటించగా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దుబ్బాక లో బీజేపీ బరిలోకి దిగుతుందని వెల్లడించారు.. దాంతో ఈ మూడు పార్టీ లమధ్య మరో సారి హోరాహోరీ పోటీ తప్పేలా లేదు.. ఇక ఇటీవలే అనారోగ్యంతో దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి చెందగా దుబ్బాకలో ఆరునెలల్లో ఎన్నిక జరగాల్సి ఉంది..

ఇక అధికార పార్టీ టీ.ఆర్.ఎస్ ఇక్కడ తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి ని ఇప్పటికే ఎంచుకుంది వార్తలు వస్తున్నాయి.. రామలింగారెడ్డి కుటుంబంలోని ఎవరికైనా సీటు కల్పించి ఈ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవాలని భావిస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి రామలింగారెడ్డి ఎన్నో సేవలు చేయగా తెలంగాణ ఉద్యమంలో సైతం ఆయన చేసినా కృషి పార్టీ మరువలేదు.. దాంతో ఆ కుటుంబానికి కాకుండా ఎవరికీ సీటు ఇచ్చే ఆలోచనలో పార్టీ లేదు.. అయన భార్య కు గానీ, కొడుకు కు గానీ సీటు ఇచ్చే ఆలోచనలో పార్టీ ఉందని తెలుస్తుంది.. ఇక గతంలో టీ.ఆర్.ఎస్ పార్టీ దే పైచేయి అని చెప్పొచ్చు.. 1983 లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది.. ఇక ఆ తర్వాత నాలుగు సార్లు టీడీపీ గెలిచింది. 2009లో చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ తరపున గెలవగా 2014 , 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. అయితే ఈ సీటు ను ఇతర పార్టీ లు గెలవడం అంత సులువు కాదు ఇప్పటికే హుజూర్ నగర్ లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి రాగా ఇప్పుడు ఏమవుతుందో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -