Saturday, April 20, 2024
- Advertisement -

అప్పటి వరకు ఎందుకు ఇప్పుడు చూపించు

- Advertisement -

జనసేన అధినేతపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు మద్దతుగా దీక్ష చేసిన పవన్.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి 23 మంది ఎంపీలు ఉండి ఎలాంటి లాభంలేదన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై పార్లమెంట్‌లో ఎందుకు ప్రశ్నించలేదని, విలువలు లేని నాయకులు చట్ట సభల్లో ఎందుకు ఉంటున్నారని పవన్ తమ నేతలపై విమర్శలు చేశారని అంబటి తెలిపారు.

తన దీక్ష అనంతరం స్పీచ్‌ ప్రారంభించినప్పటి నుంచి ముగింపు వరకు పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ ప్రభుత్యాన్నే టార్గెట్‌ చేశారన్నారు. తామే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రానికి ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్‌ మాట్లుడుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజలపై అంతలా ప్రేమ ఉన్న పవన్‌ విశాఖ ప్లాంట్‌ను ఎందకు ప్రైవేటికరణ చేస్తున్నారని కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు.

టీడీపీ నాయకులతో తమను దగ్గర చేసి మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ పార్టీని తిట్టీ తిట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీని, టీడీపీని పల్లెత్తు మాట అనని పవన్‌ వైసీపీపై బురద జల్లుతున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు ఎవరెవరు దోస్తులో.. ఆ దోస్తులు ఎవ్వరిని టార్గెట్‌ చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. తాము 2024లో అధికారంలోకి వచ్చాక తమ సత్తా ఏంటో చూపిస్తామని అంటున్నారని, ఆ సత్త ఏంటో ఇప్పుడు చూపిస్తే ఏమౌతుందని అంబటి ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో గుర్తురాని పవన్‌ ఇప్పుడు గుర్తుకొచ్చాడా ?

లోకేశ్‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..?

అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -