Monday, May 13, 2024
- Advertisement -

తలరాత అంటే ఇదే.. మళ్ళీ హై కోర్టు లో జగన్ కు షాక్..?

- Advertisement -

తలరాత అంటే ఇదేనేమో.. ప్రజల మనసులను గెలిచి అన్నింటా ముందుండి గెలుస్తున్న వైసీపీ కి ఈ కోర్టు శాపం ఎప్పుడు వీడుతుందో ఏమో ప్రతి కేసు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వస్తుంది.. ఇప్పటికే చాలా కేసులూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చాయి.. అయితే ఇది వైసీపీ ని అభిమానిస్తున్న ప్రజలకు అస్సలు నచ్చడం లేదు. ఇక తాజాగా స్వర్ణ ప్యాలస్ విషయంలో హై కోర్టు లో వైసీపీ కి మరో షాక్ తగిలింది..

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో డాక్టర్ రమేష్‌పై దాఖలైన ఎఫ్ఐఆర్‌తో పాటు అరెస్ట్ వారెంట్‌పై హైకోర్టు స్టే విధించింది. రమేష్ కాష్ పిటిషన్ పై మంగళవారం హై కోర్టు లో విచారణ జరిగింది.. ఇరువర్గాల వాదనలు విన్న హై కోట్లు రమేష్ తో పాటు హాస్పిటల్ చైర్మన్ పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జరీ చేసింది.. అసలు స్వర్ణ ప్యాలస్ ను క్వారంటైన్ సెంటర్ గా అణిమతిచ్చిన కలెక్టర్ , సబ్ కలెక్టర్ ఎంహెచ్‌వోలకు ఎందుకు బాధ్యులను చేయలేదన్న ఈ సందర్భంగా ప్రశ్నించింది. కేసులో అధికారులను నిందితులకు చేరుస్తారా? అని ప్రశ్నించించింది. ఇందులో అధికారుల తప్పు కూడా ఉందని.. ఘటనకు వారు కూడా బాధ్యులేనని హైకోర్టు స్పష్టం చేసింది.

ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాద జరిగింది. ఆ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో ఇప్పటికే హై కోర్టు న్యాయమూర్తులు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో ఈ కోర్టు తీర్పువారికి ఊరటనిచ్చే అంశం.. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంపై ఉన్న కేసు ఎప్పటికి తేలనుందో మరీ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -