Thursday, May 2, 2024
- Advertisement -

ఆ ఇద్దరికి మంత్రి పదవి.. ఉత్తరాంధ్రకు డిప్యూటీ.. జగన్ ప్లాన్ ఇదే..?

- Advertisement -

ఏపీ కేబీనెట్ విస్తరణకు ముహూర్తం ఖరార్ అయింది. ఈ బుధవారం నాడు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు కొత్త మంత్రులుగా అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

నిజానికి జోగి రమేష్, పొన్నాడ సతీష్ లకు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ సామాజిక వర్గాల కూర్పుతో వేణుగోపాలకృష్ణ, అప్పలరాజులను తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారట. అయితే ఇది పక్కన పెడితే డిప్యూటీ సీఎం పదవి ఎవరికి దక్కుతుందన్న విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. బోస్ సీనియర్ నేత కావడం వల్ల.. మళ్లీ సీనీయర్ లీడర్ కే ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. ప్రస్తుతం రోడ్ల భవనాల మంత్రి ధర్మానకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఇక కొత్త మంత్రులు వేణుకు ఆర్‌అండ్‌బీ, అప్పలరాజుకు మత్స్యశాఖను అప్పగిస్తారని తెలుస్తోంది. విస్తరణలో కూడా శాఖల మార్పిడి భారీగా ఉంటుందని.. కీలకంగా ఉన్న మంత్రుల శాఖలు మారతాయనే టాక్ వినపడుతోంది. అంతేకాకుండా కొంత మందికి ప్రమోషన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందట. ఈ శాఖల మార్పు పై బుధవారం రోజు క్లారిటీ రానుంది.

నిమ్మగడ్డ విషయంలో ఊహించని ప్లాన్ వేసిన జగన్..!

కంచుకోటలో టీడీపీ దుకాణం బంద్.. గట్టి దెబ్బ కొట్టిన జగన్.!

ఆ ఇద్దరు మంత్రులకు చెక్ పెట్టనున్న సీఎం జగన్ ?

లోకేష్ బాబుకు భారీ షాక్ ఇచ్చేందుకు ప్లాన్ వేసిన జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -