Monday, April 29, 2024
- Advertisement -

లోకేష్ బాబుకు భారీ షాక్ ఇచ్చేందుకు ప్లాన్ వేసిన జగన్..!

- Advertisement -

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఓవైపు ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకెళ్తునే.. మరోవైపు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీ హయాంలోని అవినీతి అక్రమాలు బయటకు తీస్తూ ఆ పార్టీ నేతల్లో గుబులు రేకెత్తిస్తున్నారు. ఇప్పటికీ చంద్రబాబు హయాంలో మంత్రులుగా చేసిన అచ్చెన్నాయుడు తదితర నేతలను జైలుకు పంపించారు. మరికొందరిని కూడా జైలుకు పంపించేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు.

ఇదిలా ఉంటే చిన్న బాబు సీఎం జగన్ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మండలిలో టీడీపీ బలంగా ఉండటంతో ప్రభుత్వ బిల్లులు పాస్ చెయ్యకుండా అడ్డుకోగలిగింది. దీంతో సీఎం జగన్ మండలి రద్దు దిశగా పూనుకున్నారు. అయితే అది ఇంకా పూర్తిస్థాయిలో కాలేదు. దీంతో మండలి లో టీడీపీ నేతలను తనవైపు తిప్పుకొని వైసీపీ బలాన్ని పెంచుకుంటుంది. మరో పైపు ఎమ్మెల్సీ లోకేష్ బాబు పై అనర్హత వేటు వేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుంది. ఇందుకు టీడీపీ గతంలో తమపై ఉపయోగించిన ఎథిక్స్ కమిటీని అస్త్రంగా ఉపయోగించాలని భావిస్తోంది. లోకేష్ పై అనర్హత వేటు వేయాలంటే బలమైన కారణం చూపించాల్సి ఉంటుంది.

ఇందుకోసం బడ్జెట్ సమావేశాల్లో జరిగిన గొడవను వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. సభలో మంత్రులకు, టీడీపీ ఎమ్మెల్సీలకు మధ్య గొడవ జరిగినప్పుడు లోకేష్ ఫోన్ లో ఫోటోలు తీశారు. ఈ వ్యవహారం అంతా సభలోనే సీసీ కెమెరాల్లో రికార్డయింది. శాసనమండలిలో లోకేష్ బాబు సెల్ ఫోన్ లో ఫోటోలు వీడియోలు తీయడాని వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. లోక్ సభ నిబంధనలు ఉల్లంఘించారని వైసీపీ నేతలు అంటున్నారు. దీనీపై ఇప్పటికే లోకేష్ పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. చైర్మన్ పై ఒత్తిడి తెచ్చే అనర్హత వేటు వేసేలా వైసిపి పావులు కదుపుతోంది.

ఒకవేళ చైర్మన్ చినబాబు పై చర్యలు తీసుకుంటే టిడిపి మండలిలో గట్టి ఎదురు దెబ్బే ఖాయమని వైసిపి అంచనా వేస్తోంది. ఇప్పటికే మండలిలో వైసిపి తన బలాన్ని పెంచుకుంటూ పోతుంది. టిడిపికి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికే వైసీపీ మద్దతు తెలిపారు. తాజాగా చినబాబుపై అనర్హత వేటు పడితే మరికొంత మంది వైసిపిలో చేరడం ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు. ఓవైపు చినబాబుకు చెక్ పెడుతూనే మరోవైపు మండలిలో టీడీపీ మరింత బలహీనం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుంది. దీంతో మండలి రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా అనిపిస్తుంది.

ఇది వర్క్ వట్ అయితే వైసీపీలోకి బాలయ్య ?

సీఎం జగన్ చికెన్ తినడం ఎందుకు మానేశారో తెలుసా ?

ప్రధానీ మోడీ ఆఫర్ ను జగన్ తిరస్కరించడానికి కారణం ఏంటి ?

సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డీకే ఆరుణ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -