దావోస్ వెళ్లనున్న సీఎం జగన్

- Advertisement -

దావోస్ వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్‌కు కోర్టు అనుమతి లభించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో 52వ ప్రపంచ వాణిజ్య సదస్సు మే 22 నుంచి ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన నేతలు హాజరవుతారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతు సడలించాలని కోరారు. సీఎం హోదాలో అధికారిక పర్యటనకు వెళుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

అయితే జగన్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీఎం జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చింది.

కొత్త వాహనం కొంటున్నారా ? అయితే ఇది తెలుసుకోండి.

బండి సంజయ్‌పై పరువు నష్టం దావా

టీడీపీ, వైసీపీ మధ్య ఢీ అంటే ఢీ

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -