కొత్త వాహనం కొంటున్నారా ? అయితే ఇది తెలుసుకోండి.

- Advertisement -

కొన్న వాహనాలు కొనాలనుకునే వారికి మోత తప్పేలా లేదు. చడీ చప్పుడు లేకుండా తెలంగాణ రవాణా శాఖ వడ్డింపులకు సిద్ధమవుతోంది. కొత్త వాహనాలు కొనుగోలుపై రోడ్ సేఫ్టీ సెస్ ను విధించాలని నిర్ణయించింది. కొత్తగా కొనుగోలు చేసే మోటార్ సైకిల్ పై 500, కార్లపై 2 వేలు, వాణిజ్య వాహనాలపై 2 వేల 500 వసూలు చేయనున్నారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆటోలు తదితర వాణిజ్య వాహనాల రీ రిజిస్ట్రేషన్ల జరిమానాలు భారీగా పెంచింది. దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రోడ్ సేఫ్టీ సెస్ అమలుపై కొన్ని రోజుల తర్వాత ఉత్తర్వులు జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 15 ఏళ్ల దాటిన వాహనాలు రీ రిజిస్ట్రేషన్ తప్పని సరి చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

15 ఏళ్లు దాటిన వాహనాన్ని స్క్రాప్ గా భావిస్తారు. దాన్ని తిరిగి వినియోగించుకోవాలంటే మోటార్ సైకిల్ కు రెండు వేలు, కారుకు 5 వేలు చొప్పున గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి. వాణిజ్య వాహనాలకు మూడు స్లాబ్ లలో గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తారు. 7 నుంచి 10 ఏళ్ల వాహనానికి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 10 నుంచి 12 ఏళ్లకు అదనంగా మరో రూ.5 వేలు, 12 ఏళ్ల తర్వాత వీటికి అదనంగా మరో రూ.5 వేలు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

ప్రభాస్.. హీరో కాదు టైగర్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -