బండి సంజయ్‌పై పరువు నష్టం దావా

- Advertisement -

బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పరస్పర విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ..మంత్రి కేటీఆర్‌పై చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన న్యాయవాది ద్వారా ఆయనకు నోటీసులు పంపారు.

ఈ నెల 11న ట్విటర్‌లో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి కేటీఆర్‌పై బండి సంజయ్ ఆరోపణలు చేశారు. వీటిపై స్పందించిన కేటీఆర్ ఆధారాలు బయటపెట్టాలని లేదంటే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. దీనికి బండి సంజయ్ స్పందించకపోవడంతో నోటీసులు పంపారు.

- Advertisement -

కేటీఆర్‌కు పరువు నష్టం కలిగేలా తప్పుడు ఆరోపణలు చేసిన బండి సంజయ్‌..48 గంటల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే..సివిల్ క్రిమినల్ చట్టాల ప్రకారం పరిహారం చెల్లించడంతో పాటు చట్టపరమైన చర్చలకు అర్హులవుతారని నోటీసులు పేర్కొన్నారు.

కొత్త వాహనం కొంటున్నారా ? అయితే ఇది తెలుసుకోండి.

టీడీపీ, వైసీపీ మధ్య ఢీ అంటే ఢీ

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -