Sunday, May 19, 2024
- Advertisement -

సీబీఐపై బాబు కు షాక్.. జగన్ సంచలనం

- Advertisement -

గడిచిన ఐదేళ్లుగా మోడీతో కలిసి ఉన్న చంద్రబాబు చివరి ఏడాదిలో విడాకులు తీసుకొని మోడీతో కయ్యానికి కాలుదువ్వారు. ప్రతీకారంగా మోడీ తన చేతిలోని ఈడీ, ఐటీలు ఏపీలోని టీడీపీ నేతలను టార్గెట్ చేయడంతో ఏకంగా సీబీఐని ఏపీలో నిషేధించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన జగన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి జగన్ తిలోదకాలిచ్చారు. ఏపీలో సీబీఐ ఎంట్రీకి అనుమతి ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.

ఇన్నాళ్లు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ ఏపీలోకి రాకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన ఈ చట్టసవరణను జగన్ సర్కారు రద్దు చేయబోతోంది. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే సీబీఐ దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించాల్సి ఉంటుంది. కేంద్రం కక్ష సాధిస్తోందని రాష్ట్రాలు నిషేధిస్తుంటాయి.

దీంతో చంద్రబాబు సీబీఐకి ఏపీలో అనుమతి ఇవ్వలేదు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఈ అనుమతిని తీసేసి సీబీఐకి ద్వారాలు తెరిచారు.సీబీఐ ఇక ఏపీలో విచ్చలవిడిగా దాడులు చేయవచ్చు. కేసులు నమోదు చేయవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -