Saturday, May 4, 2024
- Advertisement -

కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తా

- Advertisement -

దివంగత ముఖ్యమంత్రి, మహానేత, రైతు బాంధవుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఇడుపుల పాయ‌లోని వైఎస్ఆర్ స‌మాధికి నివాళులు అర్పించిన జ‌గ‌న్ జ‌మ్మ‌ల‌మ‌డుగులో నిర్వ‌హించిన రైత దినోత్సవ సభలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ఆది అడ్డాలో జ‌గ‌న్ స్పీచ్‌కు ప్ర‌జ‌ల‌నుంచి అదిరిపోయో రెస్పాన్స్ వ‌చ్చింది.

కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు. మూడేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తామని, ఇరవైవేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.కేసీ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు కుందూ నదిపై రాజోలి, జలదరాశి ప్రాజెక్టుల నిర్మిస్తామని, డిసెంబర్ 26వ తేదీన ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు.కుంది నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నీటిని నింపుతామన్నారు.

రైతులు, పేదలు, వృద్ధులు, విద్యార్థులకు చేయూతనిచ్చే నవరత్నాలకు కడప గడపనుంచే శ్రీకారం చుడుతున్నట్టు సీఎం జగన్‌ చెప్పారు. వైఎస్సార్‌ పెన్షన్‌ పథకం కింద అవ్వాతాతలకు రూ.2,250, దివ్యాంగులకు రూ.3వేలు, డయాలసిస్‌ పేషంట్లకు రూ.10 వేలు మంజూరు చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్‌ జిల్లాకు గతంలో కంటే రెట్టింపుగా రూ.70 కోట్లు పెన్షన్‌గా ఇస్తున్నామని చెప్పారు. పెన్షన్‌ పథకానికి రూ.15,676 కోట్లు కేటాయించామన్నారు. అధికారంలోకి వ‌చ్చిన నెల‌రోజుల్లోనె ఇవ‌న్నీ చేశామ‌న్నారు.

రైతులందరికీ సున్నా వడ్డీకే రుణాలందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులకు ఉచితంగా పగటిపూట 9 గంటల కరెంట్‌ ఇస్తామని వెల్లడించారు. ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్‌ సరఫరా చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌ పంటలబీమా పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఖరీఫ్, రబీలలో సాగు చేసే 27 రకాల పంటలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

గోదావరి జలాలను శ్రీశైలానికి తీసుకొస్తే రాయలసీమ ఎలా మారిపోతుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ దిశగా అడుగులు వేశాం. గోదావరి నీటిని శ్రీశైలానికి తీసుకొచ్చి.. రాయలసీమ, ప్రకాశం జిల్లాకు నీరివ్వడానికి శ్రీకారం చుట్టామ‌న్నారు.గోదావరి జలాలను శ్రీశైలానికి తీసుకొస్తే రాయలసీమ ఎలా మారిపోతుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ దిశగా అడుగులు వేశాం. గోదావరి నీటిని శ్రీశైలానికి తీసుకొచ్చి.. రాయలసీమ, ప్రకాశం జిల్లాకు నీరివ్వడానికి శ్రీకారం చుట్టాం. చెన్నూరు సుగ‌ర్ ప్యాక్ట‌రీని మ‌ళ్లీ తెరిపిస్తామ‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -