Thursday, April 25, 2024
- Advertisement -

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కేఈకి మ‌రో సారి ఘోర అవ‌మానం…

- Advertisement -

టీడీపీలో డిప్యూటీ సీఎం, సీనియ‌ర్ నేత‌గా ఉన్న కేఈకి వ‌ర‌సుగా అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయి. ముఖ్య‌మై కార్య‌క్ర‌మాల‌కు అయ‌న‌ను పిల‌వ‌కుండా పార్టీ అధిష్టానం వ్య‌వ‌హిర‌స్తోంది. గ‌తంలో కూడా కేఈకి ఇలాంటి అవ‌మానాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మ‌రో సారి తీవ్ర అవ‌మానానికి గుర‌య్యారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని తుల్లూరులో మండలం వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణానికి భూఆకర్షణ కార్యక్రమం జరిగింది. రూ.150 కోట్ల‌తోశ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

దేవాదాయ శాఖ మంత్రి అయిన తనను పిలవకపోవడంతో కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలి పట్ల మంత్రి తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకుని గైర్హాజరు అయ్యారు. సాక్షాత్తూ దేవాదాయ శాఖ మంత్రికే ఆహ్వానం అందకపోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండేళ్ల పాటు 25 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, కళ్యాణమండపాల నిర్మాణాలు, ద్రవిడ శిల్ప రీతులతో జరుగనున్నట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. భార‌తీయ క‌ళ ఉట్టి ప‌డేలా నిర్మానాలు ఉండ‌నున‌ర్నాయి. ఆలయ నిర్మాణానికి సీఆర్డీఏ టీటీడీకి 25 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఐదు ఎకరాల్లో ఆలయం, మిగిలిన 20 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. ఇంతటి భారీ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి అయిన తనను పిలవకపోవడంపై మంత్రి కేఈ కృష్ణమూర్తి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దేవాదాయ శాఖ మంత్రికే అలాంటి ప‌రిస్థితులు ఉంటే మిగిలిన వాళ్ల సంగ‌తి ఎలాఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -