Sunday, May 12, 2024
- Advertisement -

ఏపీలో మా ఆట మొద‌ల‌వుతుంది…. ర‌ఘువీరారెడ్డి

- Advertisement -

ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చంద్ర‌బాబుపై విరుచుకు ప‌డ్డారు. భాజాపాతో ఇంకా బాబు తెగ‌దెంపులు చేసుకోల‌ద‌ని విమ‌ర్శించారు. భాజాపానుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మీరు మ‌హారాష్ట్ర మంత్రి భార్య‌కు టీటీడీలో మెంబ‌ర్ ప‌ద‌వి ఎలా ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. మ‌హానాడు వేదిక‌పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ‌న్ భ‌ర్త ప‌ర‌కాల‌ను ఎలా అనుమ‌తిస్తార‌ని మండిప‌డ్డారు. మీరు నిజంగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారని ఎవరు నమ్ముతారు? అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి టీడీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు.

బెంగులూరులో రాహుల్ గాంధీనీ బాబు క‌లిసింది కాకతాళీయమేనని, తెలుగుదేశంతో పొత్తులపై ఇంతవరకూ ఎలాంటి చర్చలూ జరగలేదని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తులు అంటూ జరుగుతున్న ప్రచారంపై కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుంటున్నాం. మా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి వచ్చిన తరువాతే దీనిపై వివరిస్తాం’ మని రఘువీరా వెల్లడించారు.

2019 ఎన్నికలే టార్గెట్ గా ముందుకు సాగనున్నామని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా మొదలు, అన్ని కీలక హామీలూ కాంగ్రెస్ వస్తేనే నెరవేరుతాయని ప్రజల్లోకి వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. కర్ణాటకలో తెలుగు వారు కాంగ్రెస్‌ను గెలిపించారు. తాజాగా 14 చోట్ల జరిగిన ఎన్నికల్లో 12 చోట్ల బీజేపీయేతర శక్తులు గెలిచాయ‌న్నారు.

పార్టీ మారుతున్నార‌న్న వార్త‌ల‌లో వాస్త‌వం లేద‌న్నారు ర‌ఘువీరా. రాజకీయాల్లో ఉన్నంతవరకు కాంగ్రెస్ లోనే వుంటానన్నారు. పార్టీలో నాది సంతృప్తికరమైన రాజకీయ జీవితం. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశార‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -