Friday, May 10, 2024
- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు మెడ‌కు చుట్టుకుంటున్న బాబ్రీప్రాజెక్ట్

- Advertisement -

బాబ్లీ కేసు తెరపైకి వచ్చింది. ఏపీ సీఎం చంద్ర‌బాబు మెడ‌కు బాబ్రీ కేసు చుట్టుకుంటోంది. 2010నాటి ఈ కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబునాయుడు, మరో 14 మంది తెలుగుదేశం నాయకుల పేరిట నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీచేసింది. ఈనెల 21వ తేదీలోగా.. వీరందరినీ అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరచాల్సిందిగా ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఒక షాక్ అయితే తిరుమలలో తన కార్యక్రమానికి హాజరుకాకుండా లోకల్ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుగుబాటు డుమ్మా కొట్టారు.

2010లో మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు, దానికి అనుబంధంగా ఉన్న ఎత్తపోతల పథకాలకు వ్యతిరేకంగా చంద్రబాబుతో పాటూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్లగా.. సరిహద్దులో మహారాష్ట్రలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో లాఠీఛార్జ్ చేశారు. చంద్రబాబుతో సహా చంద్రబాబు సహా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో ఉంచారు. తర్వాత బలవంతంగా విమానంలో హైదరాబాద్‌కు పంపిన సంగ‌తి తెలిసిందే .

ఈ ఘటన తర్వాత విధి నిర్వహరణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, అనుమతి లేకుండా వచ్చారని .. 144సెక్షన్ అమలులో ఉన్నా పట్టించుకోలేదంటూ చంద్రబాబుతో పాటూ ఎమ్మెల్యేలపై ధర్మాబాద్‌లో కేసు నమోదయ్యింది. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీకాగా.. అది పెండింగ్‌లో ఉంది. ఈ కేసుపై ధర్మాబాద్‌ కోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉండటాన్ని ప్రశ్నించాడు. దీంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

అప్పట్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది.. బాబ్లీ నిర్మాణాన్ని అడ్డుకోడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. చంద్రబాబు నాయుడు ఓ పొలిటికల్ డ్రామా నడిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఉంది. కేంద్రంతో తెగ‌దెంపులు చేసుక‌న్న త‌ర్వాత క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లో భాగంగానే ఇదంతా అంటున్నారు బాబు టీమ్‌. ఈ వారంట్ల దెబ్బకు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని నమ్ముతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -