Friday, March 29, 2024
- Advertisement -

ఇలా అయితే కష్టం..! చంద్రబాబు, లోకేశ్​పై క్యాడర్​ నిరుత్సాహం

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్​ పై టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కరోనా వచ్చినప్పటి నుంచి చంద్రబాబు, లోకేశ్​ ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. నిత్యం జూమ్​ మీటింగ్​లో, ట్విట్టర్​లో పోస్టులు తప్ప.. క్షేత్రస్థాయిలో ఒక్క ప్రజాపోరాటం కూడా చేయలేదు. వీళ్ల వైఖరి పట్ల టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయట. ఓ వైపు సీఎం జగన్​ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. గ్రామస్థాయిలో ఆ పార్టీ బలపడుతోంది. కానీ టీడీపీ అధినేత మాత్రం కేవలం మీడియాను మాత్రమే నమ్ముకోవడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. ఇలా చేస్తే 2024లో టీడీపీ అసలు పోటీఇవ్వడం కూడా కష్టమేనని వారు అభిప్రాయపడుతున్నారట.

మరోవైపు టీడీపీ మొదటి నుంచి అండగా నిలబడుతున్న ఓ బలమైన సామాజికవర్గ నేతలు సైతం ఇప్పుడు చంద్రబాబు వైఖరి పట్ల ఆందోళనగా ఉన్నారని సమాచారం. ఆయన నాయకత్వంలో అసలు పార్టీ అధికారంలోకి రావడం సాధ్యమేనా? అని అంతర్గతంగా చర్చిస్తున్నారట. అందుకే పదే పదే జూనియర్​ ఎన్టీఆర్​ ప్రస్తావన తీసుకువస్తున్నట్టు సమాచారం. మరోవైపు చంద్రబాబు నాయుడు కేవలం కోర్టులు, కేసులు, ఎంపీ రఘురామకృష్ణంరాజు వంటి వాళ్లను నమ్ముకొని రాజకీయం చేయడం కార్యకర్తలకే నచ్చడం లేదట. ఇలా చేస్తే.. ప్రజల నుంచి మద్దతు రాకపోగా చీత్కారాలు ఎదురవుతున్నాయని వారు అంటున్నారట.

Also Read: నువ్వు బయట ఎంత తోపు అయినా కావచ్చు.. చిరుతను క్షణాల్లో ఈడ్చుకెళ్లిన మొసలి..!

చంద్రబాబు అసలు ఆంధ్రప్రదేశ్​కు చుట్టం చూపుగా వచ్చి పోతుండటం కూడా వాళ్లకు నచ్చడం లేదట. నిజానికి ప్రతిపక్ష నేత సొంత రాష్ట్రంలోనే ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రజలతో మమేకం కాగలుతారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం నిత్యం హైదరాబాద్​లోనే ఉంటారు. అత్యవసరం అయితే తప్ప ఆంధ్రప్రదేశ్​కు రారు. కార్యకర్తలు తమ కష్టాలు చెప్పుకోవడానికి అధినేత అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జిలను నియమించినప్పటికీ వారు కూడా అందుబాటులో ఉండటం లేదు.
అంతేకాక టీడీపీ లో ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించే నేతలే లేకుండా పోయారు.

అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, పట్టాభి వీళ్లు ముగ్గురు మాత్రమే మీడియా ముందు మాట్లాడుతుంటారు. ఇక సీనియర్​ నేతలు ఎనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు కేవలం ట్విట్టర్​కే పరిమితం అయ్యారు. ఇక చాలా జిల్లాల్లో టీడీపీ నేతలు యాక్టివ్​గా లేరు. దీంతో టీడీపీకి భవిష్యత్​ ఉందా? లేదా? అన్న మీమాంసలో పడిపోయారు కార్యకర్తలు. ఇప్పటికైనా చంద్రబాబు మీడియాను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం మాని.. ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాఉద్యమాలు నిర్మించాలని కోరుతున్నారు తెలుగు తమ్ముళ్లు.

Also Read: సోనూసూద్​ .. మరో సంచలన నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -