Thursday, April 25, 2024
- Advertisement -

బీజేపీ జోష్ కొనసాగేనా ?

- Advertisement -

భారత జనత పార్టీ జాతీయ నేతలంతా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ఏ స్థాయిలో ప్రయత్నిస్తున్నారో ఇటీవల జరిగిన బహిరంగ సభను బట్టి స్పష్టంగా అర్థమౌతుంది. సభకు ఊహించిన దానికంటే కాస్త ఎక్కువే ప్రజలనుండి రెస్పాన్స్ రావడంతో కమలనాథులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదే జోష్ ను కొనసాగిస్తూ రాబోయే ఎన్నికల్లో విజయ ఢంఖా మోగించాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దానికోసం పార్టీ కార్యక్రమాలలో వేగం పెంచి, తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు పూర్తిగా ప్రజల్లోనే ఉండేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు బీజేపీ నేతలు.

ముఖ్యంగా బీజేపీపై ప్రజల్లో సానుకూలత ఏర్పడేలా, ప్రస్తుతం ఉన్న టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం యొక్క వైపల్యాలను, ఇచ్చిన హామీలను నిలుపుకోకపోవడం, వారసత్వ పరిపాలన, అవినీతి, వంటి అంశాలను లేవనెత్తుతూ పోరుకు సిద్దమయ్యారు తెలంగాణ కమలనాథులు. లోక్ సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూనే, ఇతర పార్టీలలోని కీలక నేతల చేరికలపై స్పెషల్ ఫోకస్ చేయాలని జాతీయ కమలదళం ఆదేశాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో తదుపరి కార్యచరణపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డికె అరుణ, ఈటెల రాజేందర్, వంటి వారు ఇటీవల బేటీ కావడం ఆసక్తి రేపుతోంది. ఎన్నో ఏళ్లుగా దక్షిణాదిన పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ, అందుకు అనుగుణంగా తెలంగాణతోనే ముందడుగు పడేలా వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం బీజేపీపై తెలంగాణ ప్రజల్లో కాస్త సానుకూలత ఏర్పడిందనేది కాదనలేని విషయం.. దాంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలోనూ చేజార్చుకోకూడదు అని బీజేపీ జాతీయ నాయకులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -