Friday, May 3, 2024
- Advertisement -

అస్సాంలో దూసుకెళ్తున్న బీజేపీ..

- Advertisement -

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తమిళనాడులోని కోయంబత్తూరు సౌత్ నుంచి బరిలోకి దిగిన మక్కల్ నీది మయ్యం చీఫ్, ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ తన ప్రత్యర్థిపై 46 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేరళలోని పాలక్కడ్‌లో బీజేపీ అభ్యర్థి మెట్రో శ్రీధరన్ తన సమీప ప్రత్యర్థిపై 1425 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కాంగ్రెస్, బీజేపీకి షాక్ ఇస్తున్న కమల్ హాసన్..

ధర్మదామ్ నుంచి పోటీలో ఉన్న ముఖ్యమంత్రి విజయన్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాల్లో అధికార బిజెపి దూకుడు కొన‌సాగుతోంది. ఆదివారం జ‌రుగుతున్న ఓట్ల లెక్కింపులో బిజెపి 52 సీట్ల‌లో ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఇక ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ కూట‌మి 28 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా, 82 శాతం ఓట్లు పోల‌య్యాయి.

తమిళనాట దూసుకు వెళ్తున్న డీఎంకే

2016 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నాయకత్వంలోని ఎన్ డిఎ కూటమి 86 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అసోంలో తిరిగి మళ్లీ ఎన్ డిఎ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 126 అసెంబ్లీ స్ధానాలకు గాను బీజేపీ 76 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ 41 స్ధానాల్లో ముందంజలో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -