Saturday, April 20, 2024
- Advertisement -

రాష్ట్రపతిగా ఎస్టీ మహిళా.. అసలు బీజేపీ ప్లానేంటి ?

- Advertisement -

ప్రస్తుతం వ్యాప్తంగా సంచలనం రేపుతున్న రాష్ట్రపతి ఎన్నికలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి దాకా రాష్ట్రపతి అభ్యర్థి రేస్ లో వెంకయ్య నాయుడు పేరు దాదాపు ఖాయమని అందరూ భావించారు అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఎస్టీ మహిళా ద్రౌపది ముర్ము ను అభ్యర్థి రేస్ లో ఉంచింది ఎన్డీయే కూటమి. ఈ నేపథ్యంలో ఒక ఎస్టీ మహిళా రాష్ట్రపతి అభ్యర్థి రేస్ లోకి రావడంతో విపక్షాలు సైతం అమెకు మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి, అయితే రాష్ట్రపతి అభ్యర్థి రేస్ లో ఒక ఎస్టీ మహిళను నిలబెట్టడం వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎందుకంటే ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంతే కాకుండా వచ్చే ఏడాది రాజస్తాన్, కర్నాటక, త్రిపుర, మద్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ వంటి రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికలు జరగనున్న ఆయా రాష్ట్రాలలో బడుగు సామాజిక వర్గాల ప్రజలే ఎక్కువ. దాంతో ఎస్టీ మహిళా ను రాష్ట్రపతి గా నిలబెట్టడం వల్ల బీజేపీపై ప్రజల్లో సానుకూలత ఏర్పడుతుంది. అందువల్ల ఎన్నికల ప్రచారంలో బలంగా దూసుకుపోయి ఎన్నికలు జరిగే అన్నీ రాష్ట్రాలలో కూడా కాషాయజెండా పాతాలని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓ వైపు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళను ఎన్నుకోవడంపై అన్నీ వైపులా మోడీ నిర్ణయంపై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరు కేటాయించడంపై ద్రౌపది ముర్ము ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ గా విధులు నిర్వహించిన తనకు రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యంగ పదవి నిర్వహించడం ఇబ్బంది కాదని, ఇంకా బాద్యతయుతంగా పని చేస్తానని ఆమె అన్నారు. ఇక దాదాపు రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నందున, ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జగన్ సార్ .. ఆ పథకం కేవలం చెప్పుకోవడానేకేనా ?

వెంకయ్యకు షాక్ ఇచ్చిన మోడీ..!

కాంగ్రెస్ నేతల్లో ఊహించని మార్పు ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -