Tuesday, March 19, 2024
- Advertisement -

కాంగ్రెస్ నేతల్లో ఊహించని మార్పు ..?

- Advertisement -

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయమే ప్రజలు మరిచిపోయారు. ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ చరిత్ర చెప్పుకోవాలంటే సమైక్యాంధ్ర ముందు సమైక్యాంధ్ర తరువాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీలో కాంగ్రెస్ గురించి ఆలోచించడం అతిశయోక్తి అవుతుంది. కొద్దో గొప్పో కాంగ్రెస్ బతికి ఉందంటే అది తెలంగాణలోనే. దాంతో ఉన్న చొటైన స్తిరంగా నిలబెట్టుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో పిసిసిఐ చైర్మెన్ గా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన నేతృత్వంలోనైనా తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుందని అధిష్టానం భావించినప్పటికి అలాంటి పరిస్థితి ఏమి కనిపించడం లేదు. దాంతో రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పుంజుకోవలని కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలోని కీలక నేతలంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారట. గత ఎన్నికల్లో పోటి చేసిన నియోజిక వర్గాల్లో కాకుండా ఈ సారి కొత్త నియోజిక వర్గాలలో పోటీ చేయాలని పార్టీ లోని కీలక నేతలంతా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి 2018 ఎన్నికల్లోనూ.. గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలైయ్యారు.

దాంతో ఆయన ఈ సారి నల్గొండ ఎం‌పి స్థానానికి పోటీ చేసేందుకు సిద్దమౌతున్నట్లు సమాచారం. ఇక నల్గొండ ఎంపీ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సారి హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక పిసిసి ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కి గౌడ్ కూడా నిజామాబాద్ లోక్ సభకు కాకుండా గ్రేటర్ పరిధిలోని నియోజిక వర్గం నుంచి పోటీ చేస్తాడనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. ఇక పిసిసి ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మెన్ దామోదర రాజనర్సింహా ఆందోల్ నుంచి కాకుండా జహీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్ నేతల్లో ఈ నియోజిక మార్పులతోనైనా కాంగ్రెస్ ఫెట్ మారుతోందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

బీజేపీకి జనసేన గుడ్ బై చెప్తుందా ?

మోడీ రాక.. నేతల్లో కొత్త టెంక్షన్ !

ఆపరేషన్ గుజరాత్ .. మోడీకి చెక్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -