ఆ పథకం రైతులకు అండ కాదు.. దండగా ?

- Advertisement -

ప్రకృతి వైపరీత్యాల అంగ్ ఆ కారణంగా రైతులకు పంట నష్టం జరిగినప్పడు వారిపై పెట్టుబడి భారం పడకుండా రైతులకు పరిహారం చెల్లించేందుకు, జగన్ ప్రభుత్వం ” వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకాన్ని” కొనసాగిస్తోంది. ఈ పథకం ద్వారా నష్టపోయిన రైతులకు వారి అకౌంట్లో ఇటీవల నేరుగా నగదు జమ చేశారు కూడా. అంతే కాకుండా దేశంలో ఎక్కడనేని విధంగా పంటల భీమాకు ప్రీమియం ను పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. అయితే ఈ పథకంపై రాష్ట్రంలో ఎక్కువ శాతం విమర్శలే వినిపిస్తున్నాయి. నిజంగా నష్టపోయిన రైతులకు ఈ పథకం అందడంలేదని చాలా మంది రైతులు రోడెక్కి నిరసనలు చేపడుతున్నారు.

దాంతో విపక్షాలు సైతం ఈ పథకం లోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నాయి. వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకాన్ని జగన్ అతఃపుర రహస్యంలా ఉంచుతున్నాడని, టీడీపీ నేత నక్క ఆనంద్ బాబు ఘాటుగానే విమర్శలు గుప్పించారు. గ్రామ యూనిట్ గా భీమా సొమ్మును ఎంతమందికి చెల్లించారో వివరాలను బహిర్గతం చేయాలని నక్క ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. ఇక ప్రజల విషయానికొస్తే ఈ పథకం మీద గట్టిగానే విమర్శలు చేస్తున్నారు.

- Advertisement -

ఈ పథకానికి సంభంధించి పూర్తి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రైతు భరోసా కేంద్రాలలో ఉండడంతో అక్కడ వైసీపీ నాయకుల ప్రమేయం వల్ల వారు రికమెండేషన్ చేసిన వారికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, నిజంగా నష్టపోయిన రైతులకు అవకాశం కల్పించడంలేదని, వాపోతున్నారు. దాంతో సచివాలయాల వద్ద, రైతు భరోసా కేంద్రాల వద్ద చాలా మంది రైతులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కలుగజేసుకొని నష్టపోయిన రైతులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. అయినప్పటికి ఎలాంటి ఫలితం లేదు.ఈ పథకం ద్వారా ఇటీవల 15.61 లక్షల మంది రైతులకు, ఏకంగా 2997.66 కోట్ల పంటల భీమా పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించినట్లుగా గొప్పగా చెప్పుకుంది. కానీ గ్రామ స్థాయిలో ఈ పంటల భీమా పథకం ద్వారా నిజంగా నష్టపోయిన లాభం పొందడా ? అంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే అవుతుంది.

ఇవి కూడా చదవండి

జనసేన.. బీజేపీకి టాటా చెప్తుందా ?

టీడీపీ కనుమరుగవ్వడం ఖాయమేనా ?

వెంకయ్యకు షాక్ ఇచ్చిన మోడీ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -